Dmart owner new house photos : డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ.. మూడు నెలల క్రితం కొన్న కొత్త ఇంటి ఫొటోలు.. తాజాగా బయటకు వచ్చాయి. దాదాపు రూ.1238 కోట్లు విలువైన ఈ ఇంటిని 2023 ఫిబ్రవరిలో దమానీ కొనుగోలు చేశారు. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలను.. ఓ వ్యాపార సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దిగ్గజ బిలియనీర్లకు నిలయమైన ముంబయి నగరంలోనే.. ఈ కొత్త ఇంటిని కోట్లు ఖర్చు చేసి కొన్నారు రాధాకిషన్ దమానీ. ప్రస్తుతం రూ.13,658 కోట్ల సంపద కలిగిన దమానీ.. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం దక్షిణ ముంబయిలో 28 ఫ్లాట్లతో కూడిన హై-ఎండ్ రెసిడెన్షియల్ భవనాన్ని కొనుగోలు చేశారు.
దమానీ కుటుంబం, ఆయన స్నేహితులు కలిసి.. మొత్తం 1,82,084 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన భవనాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 100 కంటే ఎక్కువ పార్కింగ్ ప్లేస్‌లు ఉన్నాయి. ముంబయిలోని వర్లీ జిల్లా.. త్రీ సిక్స్టీ వెస్ట్ సొసైటీలో ఈ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడ 5వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియాకు.. దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. పలు మీడియా కథనాల ప్రకారం.. సహానా గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుధాకర్ శెట్టి నుంచి.. దమానీ ఈ ఫ్లాట్లు కొన్నట్లు తెలిసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
2021లోనూ రాధాకిషన్ దమానీ తన సోదరుడు గోపీకిషన్ దమానీతో కలిసి.. ముంబయిలోని మలబార్ హిల్‌లో రెండంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశారు. 5752.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 90 ఏళ్ల నాటి ఈ భవనాన్ని.. మొత్తం రూ.1001 కోట్లు పెట్టి కొన్నారు. ఒక్కో చదరపు అడుగుకు రూ.1,61,670 ఖర్చు చేశారు. ఈ మధ్యకాలంలోనే దాదాపు రూ.400 కోట్లతో మరో ఏడు ప్రాపర్టీలను సైతం దమానీ కొనుగోలు చేశారు.
దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఫ్లాట్.. రూ.369 కోట్లకు సేల్.. ఎవరు కొన్నారో తెలుసా?
నెల రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్‌కేర్ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కుటుంబసభ్యులు.. ఓ ట్రిప్లెక్స్ ఇంటిని అక్షరాలా రూ.369కోట్లకు కొనుగోలు చేశారు. దక్షిణ ముంబయిలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్స్ ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. తపారియా కుటుంబం బీచ్ వ్యూ ఉన్న ఈ లగ్జరీ ఇంటిని లోధా గ్రూప్‌నకు చెందిన మార్కోటెక్ డెవలపర్స్ నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయిలో సూపర్ లగ్జరీ నివాస టవర్‌గా పేరొందిన లోధా మలబార్ ప్యాలెస్‌లోని 26,27,28 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్ ఉంది. ఈ ఫ్లాట్ వైశాల్యం 27,160 చదరపు అడుగులు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి