ETV Bharat / business

డిస్నీ+ హాట్​స్టార్​ యూజర్లకు మరో షాక్.. ఇకపై ఆ సూపర్ హిట్ షోస్​ కూడా బంద్! - డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ హెచ్​బీఓ న్యూస్​

డిస్నీ+ హాట్​స్టార్ యూజర్లకు బ్యాడ్​న్యూస్​. ఇటీవలే ఐపీఎల్​ ప్రసారాలకు దూరమైన డిస్నీ+హాట్​స్టార్​లో మరో ప్రముఖ కంటెంట్​కు కూడా మాయం కానుంది. హాలీవుడ్​ సినిమాలను అందించే హెచ్​బీఓ ప్రసారాలకు మార్చి 31 నుంచి గుడ్​బాయ్​ చెప్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

disney hotstar hbo content
disney hotstar hbo content
author img

By

Published : Mar 8, 2023, 4:09 PM IST

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫాం డిస్నీ+ హాట్​స్టార్​ సబ్​స్క్రైబర్​లకు​ బ్యాడ్​న్యూస్. ఇటీవలే ఐపీఎల్ టోర్నీ​ ప్రత్యక్ష ప్రసార హక్కులను కోల్పోయిన హాట్​స్టార్​.. ఇప్పుడు ప్రముఖ హెచ్​బీఓ కంటెంట్​కు​ కూడా దూరమైంది. హాలీవుడ్​ సినిమాలతో పాటుగా ప్రముఖ షోలను అందించే హెచ్​బీఓ కంటెంట్.. మార్చి 31 నుంచి హాట్​స్టార్​లో ఉండదని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సంస్థాగత ఖర్చులను తగ్గించుకోవాలని తీర్మానించుకున్న కొద్ది రోజులుకే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ప్రముఖ హెచ్​బీఓ ఛానల్​లో ప్రసారం అయ్యే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ద లాస్ట్ ఆఫ్ అజ్, ఇండస్ట్రీ, వాచెమెన్​ షోలకు భారత్​లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అమెరికాలో ప్రసారం అయ్యే ఈ షోలు అదే రోజున హాట్​స్టార్​ ద్వారా భారత్​లో కూడా అందుబాటులోకి వచ్చేవి. ఇకపై మాత్రం అలా కుదరదు. అయితే.. ప్రస్తుతం 10 భాషల్లో లక్ష గంటలకు పైగా హాట్​స్టార్​లో ఉన్న టీవీ షోలు, సినిమాలు, రకరకాల స్పోర్ట్స్​ కార్యక్రమాలను చూసి ఆనందించవ్చని డిస్నీ+ హాట్​స్టార్ ట్వీట్​ చేసింది.

దక్షిణాసియాలో మంచి మార్కెట్​ను అందించే ఐపీఎల్​ టోర్నీ ప్రసార హక్కులను కూడా డిస్నీ+హాట్​స్టార్ గత ఏడాది కోల్పోయింది. గతంలో దీని ప్రసార హక్కుల కోసం అని వందల మిలియన్లు పెట్టుబడి పెట్టి.. ప్రపంచ రికార్డును సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీని హక్కులకు కూడా వదులుకొంది. దీంతో చాలా మంది క్రికెట్​ అభిమాన సబ్‌స్క్రైబర్‌లను డిస్నీ+ హాట్​స్టార్ కోల్పోయింది. ప్రస్తుతం డిస్నీ+ హాట్​స్టార్​కు దాదాపుగా 50 మిలియన్ల మంది సబ్​స్క్రైబర్​లను ఉన్నారు. ఇటువంటి నిర్ణయాలతో.. వారిని నిలుపుకోవడం కష్టంగా మారుతుంది.

భారత్​లో విపరీతమైన ప్రజాదరణ కలిగిన ఓటీటీ ప్లాట్​ఫాంలలో డిస్నీ+ హాట్​స్టార్​ ఒకటి. అయితే ఈ స్ట్రీమింగ్ సంస్థ గత రెండేళ్లుగా కంపెనీలో విస్తృతమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే కొంత మంది ఉద్యోగులను కూడా తొలగించింది. కంపెనీ ఖర్చులను చాలా వరకు తగ్గించింది. ఈ మార్పుల్లో భాగంగానే ఐపీఎల్​ ప్రసార హక్కులతో పాటుగా హెచ్​బీఓ కంటెంట్​కు కూడా గుడ్​బై​ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హెచ్​బీఓ కంటెంట్​కు భారత్​లో విపరీతమైన ప్రజాదరణ ఉన్నందున తమ మార్కెట్​ను నిలుపుకోవడానికి.. అమెజాన్​తో చర్చలు జరుపుతున్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జియోలో ఫ్రీగా ఐపీఎల్​..!
ఐపీఎల్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. క్రికెట్‌ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. టీవీలు చూడ్డానికి వీలుపడని వారంతా మొబైల్‌ ఫోన్లను ఆశ్రయిస్తారు. అయితే, ఇప్పటి వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ కింద కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. దీంతో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికే ప్రసారాలు చూసే భాగ్యం దక్కేది. అయితే, ఈసారి ఉచితంగా ఐపీఎల్‌ ప్రసారాలను అందించేందుకు సన్నద్ధమవుతోంది రిలయన్స్‌. 2023 ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న రిలయన్స్‌.. మ్యాచ్‌ ప్రసారాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.