ETV Bharat / business

త్వరలోనే డిజిటల్ కరెన్సీ.. పైలట్ ప్రాజెక్టు కోసం ఆర్​బీఐ చర్చలు - డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ

DIGITAL CURRENCY RBI : డిజిటల్‌ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్‌టెక్‌ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌లతో ఆర్‌బీఐ సంప్రదింపులు జరుపుతోంది.

RBI DIGITAL CURRENY
RBI DIGITAL CURRENY
author img

By

Published : Sep 4, 2022, 9:08 AM IST

DIGITAL CURRENCY RBI : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో డిజిటల్‌ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్‌టెక్‌ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌లతో ఆర్‌బీఐ సంప్రదింపులు జరుపుతోంది. ఆర్‌బీఐ ఇన్నోవేషన్‌ హబ్‌తో పలు చర్చలు జరిపినట్లు ఎఫ్‌ఐఎస్‌ సీనియర్‌ డైరెక్టర్‌ జూలియా డెమిదోవా వెల్లడించారు. ఆర్‌బీఐతో ఇప్పటికే పనిచేసిన అనుభవం తమకు ఉందని, సీఐఎస్‌ వ్యవస్థలతో సీబీడీసీ నిర్వహణ అవకాశాలను చూస్తున్నట్లు తెలిపారు. సీబీడీసీలపై అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకర్లతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, వర్క్‌షాప్‌లను ఎఫ్‌ఐఎస్‌ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆఫ్‌లైన్‌ చెల్లింపులు, ప్రొగ్రామబుల్‌ చెల్లింపులు, కొత్త పరపతి విధాన టూల్‌కిట్‌, వడ్డీ రహిత సీబీడీసీ, ఫ్రాక్షనల్‌ బ్యాంకింగ్‌ సమస్యలు, అందరికీ ఆర్థిక సేవలు, సీమాంతర సీబీడీసీ చెల్లింపులపై కేంద్ర బ్యాంకులకు సలహాలు ఇస్తున్నట్లు డెమిదోవా తెలిపారు.

బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత వినియోగం:
సీబీడీసీకి ఆర్‌బీఐ తోడ్పాటు ఉంటుంది. దీన్ని డిజిటల్‌ రూపంలో భద్రపరుస్తారు. కాగిత కరెన్సీలోకి కూడా మార్చుకుని, ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌లో చూపేందుకు అవకాశం ఉంటుంది. దీంతో డిజిటల్‌ కరెన్సీ న్యాయబద్ధతకు ఢోకా ఉండదు. సీబీడీసీ అభివృద్ధికి ఆర్‌బీఐ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని వినియోగించే అవకాశం ఉందని, నియమ నిబంధనలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ ప్రయోగాత్మకంగా నిర్వహించాల్సిందిగా ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలను ఆర్‌బీఐ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదే డిజిటల్‌ కరెన్సీ రావొచ్చని, విధివిధానాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని ఒక బ్యాంకర్‌ తెలిపారు. యూపీఐ లావాదేవీలు జోరందుకోవడంతో డిజిటల్‌ కరెన్సీకి మార్గం సుగమమైందని ఈవై పార్టనర్‌, లీడ్‌ (ఆర్థిక సేవలు) విక్రమ్‌ బబ్బర్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీల వినియోగం పెరగడంతో మోసాలు, సైబర్‌ నేరాలు కూడా ఎక్కువయ్యాయని అన్నారు. వీటిని అరికట్టేందుకు ఆర్‌బీఐ తీసుకొచ్చే డిజిటల్‌ కరెన్సీ మంచి మార్గమని అభిప్రాయపడ్డారు.

ఆర్‌బీఐ చట్టానికి సవరణలు:
డిజిటల్‌ కరెన్సీని తీసుకురానున్నట్లు సాధారణ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. సీబీడీసీ ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ నిర్వహణ కోసం 1934 ఆర్‌బీఐ చట్టంలో సవరణలు చేసినట్లు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ ఛౌద్రీ ఇప్పటికే వెల్లడించారు. హోల్‌సేల్‌, రిటైల్‌ విభాగాల్లో సీబీడీసీని దశలవారీగా అమలు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.