Different Types Of Number Plates In India : దేశంలోని ప్రతీ వాహనానికి నంబర్ ప్లేట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకుండా వాహనం నడిపోతే పోలీసులు భారీగా జరిమానా విధిస్తారు. వాహనాలను, వాహనదారులను సులువుగా గుర్తించడానికి వీలుగా నంబర్ ప్లేట్‌ను రవాణశాఖ కేటాయిస్తుంది. ప్రతీ వాహనానికి ఉండే నంబర్ ప్లేట్ అనేది భిన్నంగా ఉంటుంది. ద్విచక్ర వాహనం, కారు.. ఇలా ఒక్కో వాహనానికి ఉండే నంబర్ ప్లేట్ ఒక్కో రంగులో విభిన్నంగా ఉంటుంది. తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా విభిన్న రంగుల్లో నంబర్ ప్లేట్లు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. మరి ఇవి వివిధ రకాల రంగుల్లో ఎందుకు ఉంటాయి? వీటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుపు రంగు నంబర్ ప్లేట్
White Number Plate : భారతదేశంలో తెలుపు రంగులో ఉండే నంబర్ ప్లేట్లను ఎక్కువగా చూస్తూ ఉంటాం. తెలుపు రంగు ప్లేట్‌పై నలుపు రంగులో ఆక్షరాలు ముద్రిస్తారు. ప్రైవేట్ లేదా నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ తెలుపు రంగు నంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. ఈ వాహనాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ముఖ్యంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం లేదా వాహనాన్ని అద్దెకు ఇవ్వడం లాంటివి చేయకూడదు.
![White Number Plate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2023/19469902_white-number-plate.jpg)
పసుపు రంగులో ఉంటే..
Yellow Number Plate : ఇక కార్లపై పసుపు రంగులో ఉండే నంబర్ ప్లేట్‌ను చూసే ఉంటారు. పసుపు రంగులో ఉండే ప్లేట్‌పై నలుపు రంగులో ఆక్షరాలు ఉంటాయి. టాక్సీలు, ఆటోలు లాంటి ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాలకు ఈ నంబర్ ప్లేట్ కేటాయిస్తారు. వీటిని అద్దెకు ఇచ్చుకోవడం, ప్రయాణికులను ఎక్కించుకోవడం లాంటివి చేయవచ్చు. ఈ వాహనాలకు ట్యాక్స్ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వాహనాలను నడిపే డ్రైవర్లు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
![Yellow Number Plate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2023/19469902_yellow-number-plate.jpg)
పచ్చ రంగులో ఉంటే అర్ధం ఏంటి..?
Green Number Plate : కార్లు, ఆటోలపై పచ్చ రంగులో ఉంటే నంబర్ ప్లేట్లు కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు మత్రమే ఇలాంటి నంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. పచ్చ రంగు ప్లేట్‌పై తెలుపు రంగులో ఆక్షరాలు ముద్రించి ఉంటాయి. ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేస్తారు.
రెడ్ కలర్‌లో ఉంటే..
Red Number Plate : రెడ్ కలర్‌లో ఉండే నంబర్లు ప్లేట్ కలిగిన వాహనాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎరుపు నంబర్ ప్లేట్‌పై తెలుపు రంగు ఆక్షరాలు ఉంటాయి. వెహికల్‌కి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేంత వరకు తాత్కాలికంగా రెడ్ నంబర్ ప్లేట్ ఉపయోగించుకోవచ్చు. టెస్టింగ్ వాహనాలకు ఎక్కువగా ఈ నంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. ఈ నంబర్ ప్లేట్ ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
![Red Number Plate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2023/19469902_red-number-plate-2.jpg)
నీలం రంగు నంబర్ ప్లేట్
Blue Number Plate : విదేశీ దౌత్యవేత్తల కోసం తెలుపు రంగు అక్షరాలతో నీలం రంగు నంబర్ ప్లేట్‌ను కేటాయించడం జరిగింది. ఈ నంబర్ ప్లేట్స్‌లో ప్రధానంగా 3 రకాల కోడ్లు ఉంటాయి. అవి:
- కాన్సులర్ కార్ప్స్ (CC)
- యునైటెడ్ నేషన్స్ (UN)
- కార్ప్స్ డిప్లొమాటిక్ (CD)
వాస్తవానికి ఈ బ్లూ నంబర్ ప్లేట్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాల కోడ్లకు బదులుగా, సదరు దౌత్యవేత్తకు చెందిన దేశం కోడ్ ఉంటుంది.
పైకి సూచించే బాణం గుర్తుతో నంబర్ ప్లేట్
Number plate with upward pointing arrow : ఈ రకం నంబర్ ప్లేట్లను సైనిక అవసరాల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నంబర్ ప్లేట్లు రక్షణ శాఖ పేరు మీద రిజిస్టర్ అయ్యుంటాయి. సాధారణంగా ఈ నంబర్ ప్లేట్ మొదట్లో లేదా రెండవ అక్షరం తరువాత బాణం గుర్తు ఉంటుంది. బాణం గుర్తు తరువాత వచ్చే అంకెలు సదరు వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. ఆ తరువాతది బేస్ కోడ్, దాని తరువాత సీరియల్ నంబర్ ఉంటుంది. చివరి అక్షరం వెహికల్ క్లాస్‌ను తెలియజేస్తుంది.
భారతదేశ చిహ్నంతో ఎరుపు రంగు ప్లేట్
Red Number Plate with Indian Emblem : ఈ నంబర్ ప్లేట్‌ను భారత రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్ వాహనాల కోసం మాత్రమే ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు.
నలుపు రంగు ప్లేట్
Black Number Plate : పసుపు రంగు అక్షరాలు కలిగిన నల్లని రంగు నంబర్ ప్లేట్‌ను సాధారణంగా లగ్జరీ హోటల్ వాహనాలకు ఉపయోగిస్తారు. ఇలాంటి కమర్షియల్ వాహనాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. వీటి డ్రైవర్లకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.
భారత్ సిరీస్
Bharat Series : ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజిస్ట్రేషన్ కోడ్ ఉంటుంది. కానీ నంబర్ ప్లేట్‌పై BH అనే భారత్ సిరీస్ ఉన్న వాహనాలను కూడా చూసే ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో తమ ఆఫీస్ కార్యాలయాలు ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు ఈ భారత్ సిరీస్ నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- Car Discounts In September 2023 : కొత్త కారు కొనాలా?.. మారుతి, హోండా కార్లపై భారీ డిస్కౌంట్స్!.. సూపర్ ఆఫర్స్!
- Credit Score Improvement Tips : క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ పాటించండి!
- How to Register An EPF Grievance Online: మీ పీఎఫ్ విషయంలో కంప్లైంట్ చేయాలా?.. ఆన్లైన్లో ఈజీగా ఇలా చేయండి..!