ETV Bharat / business

Customers No Need to Give Their Mobile Number at shopping Malls: ఇకపై బిల్ పే చేసేటప్పుడు మీ ఫోన్ నంబర్ ఇవ్వక్కర్లేదు.. కారణం ఇదే..!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 4:04 PM IST

Updated : Sep 22, 2023, 4:56 PM IST

Shopkeepers Dont Ask Customer Mobile Number at Billing Time: షాపులో బిల్ కట్టేప్పుడు మొబైల్ నెంబర్ అడగడం, ఆ తర్వాతే బిల్ ప్రాసెస్ పూర్తి చేయడం అన్ని చోట్లా చూస్తున్నదే. ఇకపై అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం తెలుసుకోవాల్సిందే.

Customers No Need to Give Their Mobile Number

Customers No Need to Give Their Mobile Number at shopping Malls: ఏదైనా మాల్‍‌కు వెళ్లి షాపింగ్​ చేసి బిల్ చెల్లించే సమయంలో అక్కడ కౌంటర్ దగ్గర మాల్​ సిబ్బంది.. కస్టమర్ మొబైల్​ నెంబర్ (Mobile Number) అడుగుతారు. సూపర్ మార్కెట్‌కు (Super Market) వెళ్లినా ఇదే పరిస్థితి. ఏవైనా వస్తువులు కొని బిల్ చెల్లించడానికి మొబైల్ నెంబర్‌తో అవసరం ఏం ఉంటుందన్న అనుమానం కూడా కస్టమర్లకు రాదు. మొబైల్ నెంబర్ చెప్పేసి, బిల్ పేమెంట్ చేసి వెళ్లిపోతుంటారు.

మాల్స్, సూపర్ మార్కెట్లోలనే కాదు వాటి బయట కూడా లక్కీ డ్రా పేరుతో ప్రజల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు తెలుసుకునేవారు కనిపిస్తుంటారు. వీరి చేతుల్లోకి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వెళ్తే మోసాలకు దారితీయొచ్చు. ఫోన్ కాల్స్, మెసేజ్​ల ద్వారా మోసాలు జరుగుతున్న ఘటనలు పెరుగుతుండటంతో.. కస్టమర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిటైల్ దుకాణాల్లో బిల్లు జనరేట్ చేసేటప్పుడు వినియోగదారులు ఫోన్​ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈమేరకు రిటైలర్స్​కు అడ్వైజరీ జారీ చేసింది.

షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్‌లలో కొత్త మార్గదర్శకాలు

షాపుల్లో లేదా బయట.. కస్టమర్ల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వ్యక్తిగత వివరాలు అందించే వరకు తాము బిల్ ప్రాసెస్ పూర్తి చేయలేమని కొన్ని షాపుల్లో చెబుతుంటారని.. ఇది కస్టమర్ల రక్షణ చట్టం ప్రకారం అన్యాయమైన, నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని వెల్లడించారు. ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారాన్ని సేకరించడం వెనుక ఎటువంటి హేతుబద్ధత లేదని ఆయన అన్నారు.

కస్టమర్ల ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు కూడా ఉన్నాయని రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం కస్టమర్ల వివరాలు సేకరించకూడదని, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా రిటైల్ పరిశ్రమ, ఇండస్ట్రీ ఛాంబర్స్‌కు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) లాంటివాటికి అడ్వైజరీ జారీ చేసినట్లు చెప్పారు. ఏదైనా డెలివరీ చేయడానికి లేదా బిల్లును రూపొందించడానికి రిటైలర్లకు ఫోన్ నంబర్‌లను అందించడం భారతదేశంలో అవసరం లేదని సింగ్ తెలిపారు. అయినప్పటికీ, రిటైలర్లు లావాదేవీని ముగించడానికి మొబైల్ నెంబర్‌లను కోరితే కస్టమర్లు ఇబ్బందికరమైన పరిస్థితిలో పడతారని ఆయన అన్నారు.

షాపింగ్స్​ మాల్స్ తెరిచినా కొనేవాళ్లు కరవు!

కాబట్టి కస్టమర్లు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సూపర్ మార్కెట్, మాల్ లేదా ఇతర షాపింగ్ సెంటర్‌లో మీరు ఏదైనా కొని, బిల్లు చెల్లించే సమయంలో మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడి సిబ్బంది ఫోన్ నెంబర్ ఇవ్వాలని పట్టుబడితే వారికి రూల్స్ గుర్తు చేయండి.

Rules Before Investing in Stock Markets: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే అంతే సంగతి..!

How to Enable AutoPay Feature in UPI Apps : మీ ఫోన్​లో 'AutoPay'ను ఇలా సెట్ చేసి.. మంత్లీ బిల్లులు ఈజీగా చెల్లించండి.!

Last Updated : Sep 22, 2023, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.