ETV Bharat / business

మీ క్రెడిట్ స్కోరు త‌గ్గ‌డానికి కారణాలేంటి?

Credit Score: రుణ సేకరణలో క్రెడిట్ స్కోరు ఎంతో ప్రాధానమైంది. దీని ఆధారంగానే బ్యాంకుల రుణ మంజూరు ఆధారపడి ఉంటుంది. మరి.. క్రెడిట్ స్కోరు తగ్గకుండా ఎలా కాపాడుకోవాలి? తెలుసుకోండి..

Credit Score
క్రెడిట్ స్కోరు
author img

By

Published : Apr 4, 2022, 5:09 AM IST

Credit Score: క్రెడిట్ స్కోరు త‌గ్గ‌డానికి వివిధ కార‌ణాలు ఉండొచ్చు. అన్నింటికంటే ముఖ్య కార‌ణం మాత్రం.. తీసుకున్న రుణాల‌ను స‌రైన స‌మ‌యానికి తిరిగి చెల్లించ‌లేకపోవ‌డమే. క్రెడిట్ కార్డులు, కారు రుణాలు, ఇత‌ర రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న ప‌ది మందిలో ఆరుగురి రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ్వ‌డానికి క్రెడిట్ స్కోరు త‌గ్గ‌డ‌మే కార‌ణ‌మ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. మరి క్రెడిట్ స్కోరును ఏవిధంగా పెంచుకోవ‌చ్చు? రుణాల‌ను స‌కాలంలో చెల్లించాలంటే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

క్రెడిట్‌ స్కోరును పెంచుకోండిలా..

  • పాత బ‌కాయిల‌ను చెల్లించండి: క్రెడిట్ స్కోరు త‌గ్గ‌కుండా ఉండాలంటే రుణ ఈఎంఐలను స‌కాలంలో చెల్లించడం త‌ప్ప‌నిస‌రి. ఒక‌వేళ మీరు ఏవైనా కార‌ణాల చేత గ‌తంలో రుణ వాయిదాలు స‌కాలంలో చెల్లించ లేక‌పోయి ఉండొచ్చు. ప‌రిస్థితులు మెరుగుప‌డి ఇప్పుడు చెల్లించే స్థితిలో ఉంటే, వెంట‌నే బ‌కాయిల‌ను క్లియ‌ర్ చేయండి.
  • క్రెడిట్ కార్డును తెలివిగా వాడండి..: క్రెడిట్ కార్డును ఉప‌యోగించి చేసే ఖ‌ర్చులు ప‌రిమితి మించ‌కుండా చూసుకోవాలి. ఇందుకోసం కొన్ని సార్లు ఖ‌ర్చుల విష‌యంలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి రావ‌చ్చు. క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించాలి. క‌నీస బిల్లును చెల్లించి మ‌రుస‌టి నెల‌కు ఆ బిల్లును వాయిదా వేసేకంటే సాధ్య‌మైనంత వ‌ర‌కు ఎక్కువ ఖ‌ర్చుచేయ‌కుండా ఉండేందుకే ప్ర‌య‌త్నించాలి. ఒక‌వేళ పూర్తి బిల్లును చెల్లించ‌లేని ప‌క్షంలో క‌నీస మొత్తాన్ని కాకుండా ఆ నెల‌కు మీకు వీలున్నంత‌ గ‌రిష్ఠ మొత్తాన్ని చెల్లించాలి. ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే బిల్లు చెల్లింపు తేదీ సైకిల్స్‌ రెండూ ఒకే నెల‌లో కాకుండా వేరు వేరు నెల్లల్లో వ‌చ్చేలా చూసుకోండి. ఇలా అవ‌స‌ర‌మైన‌ప్పుడు బిల్లు చెల్లింపు తేదీ దూరంగా ఉన్న కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేయ‌వ‌చ్చు. చెల్లింపుకు వ‌డ్డీ లేని వ్య‌వ‌ధి ఎక్కువ దొరుకుతుంది కాబ‌ట్టి సుల‌భంగా పూర్తి బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించగ‌లుగుతారు.
  • రుణం కోసం ప‌దే ప‌దే అప్లై చేయ‌కండి: ఒక బ్యాంకులో రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసి అక్క‌డ రిజ‌క్ట్ అయితే వెంట‌నే వేరే బ్యాంకుకు ద‌ర‌ఖాస్తు చేస్తుంటారు కొంద‌రు. అయితే ఒక చోట రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గురైతే అది మీ క్రెడిట్ నివేదికలో తెలుస్తుంది. దీంతో వేరే సంస్థ మీ క్రెడిట్ నివేదిక‌ను ప‌రిశీలించిన‌ప్పుడు ఏ కార‌ణం చేత మునుప‌టి బ్యాంక్ రిజ‌క్ట్ చేసిందో విశ్లేషిస్తుంది. దీంతో మరోసారి ద‌ర‌ఖాస్తు రిజ‌క్ట్ అవ్వ‌చ్చు. ఇలా రుణ ద‌ర‌ఖాస్తు రిజక్ట్ అయిన ప్ర‌తిసారీ ఆ ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపై ఉంటుంది.
  • క్రెడిట్ స్కోరు ట్రాక్ చేయండి: క్రెడిట్ స్కోరు క్ర‌మం త‌ప్ప‌కుండా ట్రాక్ చేస్తుండండి. ఒక‌వేళ రుణ‌దాతలు ఇచ్చిన నివేదిక‌లో ఏమైనా త‌ప్పులు ఉంటే అవే మీ క్రెడిట్ రిపోర్టులో ప్ర‌తిబింబిస్తాయి. అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రెడిట్ నివేదిక‌ల‌ను తెలుసుకోవడం ద్వారా అధికారిక క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి, మీ క్రెడిట్ నివేదికల్లో ఉన్న లోపాలను వారికి వివరించి సరిదిద్దుకునే అవ‌కాశం ఉంటుంది. కొన్నిసార్లు క్రెడిట్ నివేదికలోని వివరాలు, ఖాతా బ్యాలెన్స్ వంటి తప్పుడు సమాచారం వివాదాస్పదంగా మారొచ్చు. అందువ‌ల్ల ముందు జాగ్ర‌త్త‌గా ఎప్పటిక‌ప్పుడు క్రెడిట్ స్కోరును చెక్ చేసుకుంటూ ఉండాలి.

రుణ ఊబిలో చిక్కుకోకుండా ఈ జాగ్ర‌త్తలు తీసుకోండి..

  • క్రెడిట్ కార్డు వాడే వారు ప‌రిమితికి మంచి ఖ‌ర్చు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. రుణ వినియోగ నిష్ప‌త్తి ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీ చేసుకుంటూ ఉండాలి. మీ క్రెడిట్ లిమిట్‌కికి.. మీరు వినియోగించిన మొత్తానికి మ‌ధ్య నిష్ప‌త్తినే రుణ వినియోగ నిష్ప‌త్తి అంటారు. ఇది మీ క్రెడిట్ లిమిట్లో 20 -30 శాతం మాత్ర‌మే ఉండేలా చూసుకోవాలి.
  • అన్‌సెక్యూర్డ్ రుణాల‌ను చివ‌రి ఆప్ష‌న్‌గా మాత్ర‌మే ఎంచుకోవాలి. త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రాల‌కు.. త‌ప్ప‌నిస‌రి కాని అవ‌స‌రాల‌కు.. విలాసాల‌కు మ‌ధ్య తేడా తెలుసుకోవాలి.
  • ప్ర‌స్తుతం మీరు కెరియ‌ర్‌లో ఏ దశలో ఉన్నారు.. మీ ఆదాయం, ప్రస్తుత అవసరాలను జాబితాను ముందుగా త‌యారు చేయండి. మీ ప్రస్తుత ఆదాయాన్ని అనుస‌రించి ఖర్చులను పునఃపరిశీలించండి. జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఎక్క‌డ ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌చ్చో చ‌ర్చించండి. సాధ్య‌మైనంత ఎక్కువ‌ ఆదా చేసి క్ర‌మ‌మైన మ‌దుపును అనుస‌రించండి. ఇలా చేస్తే.. భ‌విష్య‌త్తులో ఇల్లు, కారు, బంగారం ఏది కొనుగోలు చేయాల‌న్నా ఎక్కువ రుణ భారం ప‌డ‌కుండా ముందుగానే కొంత మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవ‌చ్చు.
  • ఆర్థిక చరిత్ర బ‌లంగా ఉంటే రుణాలు సుల‌భంగా ల‌భిస్తాయి.

ఇదీ చదవండి: 'సినిమాల్లో ఆర్​ఆర్​ఆర్.. బిజినెస్​లో భారత్​.. రికార్డులే రికార్డులు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.