ETV Bharat / business

GST Rationalisation: జీఎస్​టీ రేటు పెంచడం లేదు: కేంద్రం

GST Rationalisation: జీఎస్​టీ స్లాబ్​ రేట్ల మార్పు వార్తల్లో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రేట్ల హేతుబద్దీకరణ కమిటీ ఇంకా నివేదిక సమర్పించలేదని తెలిపాయి.

gst news
gst news
author img

By

Published : Apr 19, 2022, 7:18 AM IST

GST Rationalisation: జీఎస్​టీలో స్లాబ్ రేట్ల​ను పెంచుతారనే వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం ఐదు శాతంగా ఉన్న జీఎస్​టీ స్లాబ్​ రేటును ఎనిమిది శాతానికి పెంచుతారన్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం 5,12, 18, 28 స్లాబ్​ రేట్లు ఉన్నాయి. ఐదు శాతం స్లాబులో ఉన్న కొన్ని ఆహారేతర వస్తువులను మూడు శాతం స్లాబులోకి మార్చి.. మిగిలిన వస్తువులను కొత్తగా ఏర్పాటు చేసే ఎనిమిది శాతం స్లాబులోకి తెస్తారని వార్తలు వచ్చాయి.

జీఎస్​టీ రేట్ల హేతుబద్ధీకరణపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని గతంలోనే ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వం వహించగా.. బంగాల్ ఆర్థిక మంత్రి అమిత్​ మిత్రా, కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్​, బిహార్​ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్​ ప్రసాద్​ సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఇప్పటివరకు నివేదికే సమర్పించలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జీఎస్​టీ ఛైర్మన్​గా ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లారని.. అందువల్లే తదుపరి జీఎస్​టీ మండలి సమావేశం ఎప్పుడనేది కూడా ఇంకా నిర్ణయించలేదని తెలిపాయి.

ఇదీ చదవండి: 10 నిమిషాల్లో డెలివరీపై మాటమార్చిన ఆనంద్​ మహీంద్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.