ETV Bharat / business

ముకేశ్​ అంబానీకి 'జెడ్ ప్లస్'​ సెక్యూరిటీ.. రక్షణగా 55 మంది.. - mukhesh ambani latest news

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ భద్రతను 'జెడ్ ప్లస్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఇకపై ముకేశ్​కు 55 మంది సిబ్బందితో భద్రత కల్పించనుండగా అందులో 10 మందికి పైగా ఎన్ఎస్​జీ కమాండోలు, ఇతర పోలీసు అధికారులు ఉంటారు.

central Govt upgrades Mukesh Ambani's security cover to Z plus

author img

By

Published : Sep 29, 2022, 9:06 PM IST

Mukesh Ambani Security: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భద్రతను కేంద్రం మరింత పటిష్టం చేసింది. నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక మేరకు ఆయన భద్రతను 'జడ్' కేటగిరీ నుంచి 'జడ్​ ప్లస్​' కేటగిరీకి పెంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇకపై ముకేశ్​కు 55 మంది సిబ్బందితో భద్రత కల్పించనుండగా అందులో 10 మందికి పైగా ఎన్ఎస్​జీ కమాండోలు, ఇతర పోలీసు అధికారులు ఉంటారు.

ఈ ఏడాది ఆగస్టులో ముకేశ్​ అంబానీ, ఆయన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ముంబయిలోని బోరివలి వెస్ట్ ప్రాంతంలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గతేడాది ముకేశ్ అంబానీ నివాసం యాంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఎస్‌యూవీని దుండుగులు నిలిపి ఉంచిన ఘటన తర్వాత​ ముకేశ్​ అంబానీ భద్రతకు కేంద్రం పెద్దపీట వేసి 'జడ్' కేటగిరీ భద్రత కల్పించింది.

ఇవీ చదవండి: గుడ్ న్యూస్.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటు పెంపు

'ప్రతి కార్​లో 6 ఎయిర్​ బ్యాగ్స్​' రూల్ విషయంలో కేంద్రం ట్విస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.