ETV Bharat / business

కారు టెస్ట్​ డ్రైవ్​కు వెళ్తున్నారా? ఈ విషయాలు మరిచిపోకండి! - టెస్ట్‌ డ్రైవ్‌ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Car Test Drive Tips in Telugu : కొత్త కారు కొనడం ఎవరికైనా ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ.. ఇన్​ సైడ్ ఆ వాహనం కండీషన్ ఎలా ఉంది? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. కాస్త అనుభవం ఉన్నవారు టెస్ట్ డ్రైవ్ చేయడం ద్వారా.. పరీక్షించే ప్రయత్నం చేస్తారు. అయితే.. కారు టెస్ట్​ డ్రైవ్​ చేసేముందు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవి ఏంటన్నది ఈ స్టోరీలో చూద్దాం.

Car_Test_Drive_Tips_in_Telugu
Car_Test_Drive_Tips_in_Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 12:52 PM IST

Car Test Drive Instructions in Telugu: కార్ల తయారీదారులు కొత్త కొత్త మోడళ్లతో.. ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. సూపర్​ ఫీచర్స్​, బెస్ట్‌ డీల్స్‌ అంటూ అనౌన్స్​ చేస్తుంటాయి. అయితే.. కొత్త కారు కొనాలనేకునేవారు షోరూమ్​కు వెళ్లి.. కారు పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉందో తెలుసుకోవడానికి "టెస్ట్‌ డ్రైవ్‌" చేస్తారు. అయితే. టెస్ట్‌ డ్రైవ్‌ చేసేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని.. అప్పుడే వాహనం పనితీరుపై క్లారిటీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి, ఆ సూచనలు ఏంటంటే..?

వేరియంట్‌: మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వేరియెంట్​నే టెస్ట్​ డ్రైవ్ చేస్తున్నారా? అన్నది చూసుకోవాలి. ఎందుకంటే.. టెస్ట్‌ డ్రైవ్‌ కోసం షోరూమ్‌లలో పరిమిత వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పండగల వంటి పీక్‌ సీజన్లలో.. ఇవి ఇంకా బిజీగా ఉంటాయి. ఈ సమయంలో మీరు టెస్ట్‌ డ్రైవ్‌ చేయాలనుకుంటే.. మీకు వేరే వేరియంట్​ను ఇవ్వొచ్చు. అవకాశం ఉంటే.. సేమ్ వేరియంట్ దొరికే వరకు టెస్ట్​ డ్రైవ్​ కోసం వెయిట్ చేయండి. లేదంటే.. వేరే షోరూమ్‌లో ట్రై చేయండి. అంత టైమ్​లేదు అనుకుంటే.. మీరు కొనుగోలు చేయాలనుకునే వేరియంట్​కు దగ్గరగా ఉండే మోడల్​ను సెలెక్ట్‌ చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. మీరు పెట్రోల్‌ వేరియంట్‌ కొనుగోలు చేయడానికి వెళ్లి.. డీజిల్‌ వేరియంట్‌ ను టెస్ట్‌ డ్రైవ్‌ చేయకూడదు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

దివాళీ ఆఫర్ - ఈ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్​, అదిరే ఫీచర్లు మీ సొంతం!

తొందరపడవద్దు: డీలర్లు తరచుగా సాయంత్రం 6 లోపు మాత్రమే టెస్ట్‌ డ్రైవ్‌ను అందిస్తారు. కాబట్టి.. హడావుడిగా వెళ్లి.. ఇన్​టైమ్​లో టెస్ట్‌ డ్రైవ్‌ పూర్తిచేయాలనే భావనతో తొందరపడి పని పూర్తి చేయకండి. ఓవర్‌వ్యూతో ఒక అంచనాకు రావద్దు. టెస్ట్‌ డ్రైవ్‌లో ఆ కారు నాణ్యతను పూర్తిగా పరిశీలించాలంటే.. తగినంత సమయం తీసుకోవాల్సిందే. మీ సమయాన్నైనా అడ్జెస్ట్ చేసుకోండి.. లేదంటే.. మీకు అడిగినంత సమయం ఇచ్చే షోరూమ్‌ల్లోనైనా టెస్ట్‌ డ్రైవ్‌ చేయండి.

ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోవద్దు: మూడ్నాలుగు కార్లను టెస్ట్ డ్రైవ్​ చేసి.. అందులో ఒకదాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటే.. కంటిన్యూగా టెస్ట్​ డ్రైవ్ చేయండి. అంటే.. ఇవాళ ఒక కారు.. రేపు మరో కారు.. ఎల్లుండి ఇంకో కారు.. ఇలా కంటిన్యూగా టెస్ట్ చేయాలి. అప్పుడే.. ఏ కారు బాగుంది అనే విషయం అర్థమవుంతుంది. అలా కాకుండా.. రోజుల తరబడి గ్యాప్​తో టెస్ట్​ డ్రైవ్​కు వెళ్తే.. రెండు కార్ల మధ్య తేడాలను స్పష్టంగా గుర్తించలేకపోవచ్చు.

కారు కొనడానికి లోన్‌ కావాలా? తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ రుణం! ఈజీ ఈఎంఐ

ఫ్యామిలీతో టెస్ట్‌ డ్రైవ్‌: కారును టెస్ట్‌ డ్రైవ్‌ చేసేటప్పుడు ఫ్రెండ్స్‌ లేదా ఫ్యామిలీతో వెళ్లడం బెటర్‌. ఎందుకంటే.. డ్రైవ్‌ చేస్తున్న వారికి ఇంజిన్, ఇతర టెక్నికల్ అంశాల మీద ఫోకస్ ఉంటుంది. అదే.. వెనుక సీట్లో మనవాళ్లు కూర్చుంటే.. సౌకర్యంగా ఉందా? లేదా? అనే విషయంపై వారు దృష్టి సారిస్తారు. ఇంకా.. ఫీచర్స్, కలర్స్‌ పైనా.. వారి అభిప్రాయాన్ని తీసుకోవచ్చు.

బేసిక్‌ పాయింట్స్‌: కారును టెస్ట్‌ డ్రైవ్‌ చేసేటప్పుడు బేసిక్ పాయింట్లను తప్పక గుర్తుంచుకోవాలి. వీటిలో.. డ్రైవ్‌ స్మూత్​గా సాగుతోందా? ఇంజిన్‌, స్టీరింగ్‌ వీల్‌, ట్రాన్స్‌మిషన్‌, బ్రేక్‌, సీటింగ్‌.. సౌకర్యంగా ఉన్నాయో లేదో నిర్ధారణకు రావాలి. వేగాన్ని మారుస్తూ.. బ్రేకుల పనితీరు తెలుసుకోండి. ఇంకా కారు కెపాసిటీ కూడా తెలుసుకోవాలి. డ్రైవర్‌ సీటులో ఉండేవారు.. ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఇంకా డ్రైవర్‌కు అన్ని వైపులా ఉండే ఫిజికల్ బటన్‌ల పనితీరును పరిశీలించాలి. కారులో సేఫ్టీ ఫీచర్లు, మైలేజ్ గురించి డీలర్‌ ద్వారా పూర్తిగా తెలుసుకోండి. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేస్తున్నట్లయితే.. ఛార్జింగ్‌, రేంజ్‌ గురించి పూర్తి వివరాలు సేకరించాలి. ఇవి పాటించడం ద్వారా.. మీరు టెస్ట్‌ డ్రైవ్‌లో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంటుంది.

Top 7 Safest Cars In India (Test Proven) : క్రాష్ టెస్టులో సూపర్ విక్టరీ.. 5 స్టార్‌ రేటింగ్ సాధించిన కార్లు ఇవే!

Jeep Compass 2024 : 9.8 సెకన్లలో 100 కి.మీ వేగం.. సూపర్ ఫీచర్స్.. ఈ కారు చూశారా?

Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.