ETV Bharat / business

హోమ్​ లోన్స్​పై ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ- పైగా బోలెడన్ని బెనిఫిట్స్​! - హోమ్​ లోన్స్​పై ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ

Best House Loan Interest Rates : ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని కోసం చాలా మంది బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్స్​ సంస్థలను ఆశ్రయిస్తారు. తక్కువ వడ్డీ రేటు ఎక్కడ లభిస్తుందా అని తెలుసుకుంటారు. అలాంటి వారి కోసమే కింది కథనం. హోమ్​ లోన్స్​పై ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటును అందిస్తున్నాయి..? ప్రాసెసింగ్ ఫీజు ఎంత..? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Best_House_Loan_Interest_Rates
Best_House_Loan_Interest_Rates
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 11:57 AM IST

Best Home Loan Interest Rates Details in Telugu: సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నదైనా.. పెద్దదైనా.. తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తాపత్రయపడతారు. కొందరు, రుణ భారం లేకుండానే ఇంటిని సొంతం చేసుకుంటే, మరికొందరికి అప్పు చేయక తప్పదు. అందుకే వీరు లోన్ కోసం బ్యాంకుల్ని ఆశ్రయిస్తారు. దాదాపు అన్ని బ్యాంకులు హోం లోన్ ఆఫర్ చేస్తాయి.

Home Loan Interest Rates 2023: హోమ్‌ లోన్‌ అనేది.. ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకునే అతి పెద్ద రుణం కావచ్చు. అమౌంట్‌తో పాటు, అప్పు తీర్చే సమయం కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి లాంగ్‌టర్మ్‌ లోన్ల విషయంలో, అప్పు తీసుకున్న డబ్బు కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, హోమ్‌ లోన్‌ విషయంలో కీలకమైనది వడ్డీ రేటు. ‍‌ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకి హోమ్​ లోన్​ దొరికితే.. అది బెస్ట్‌ హోమ్‌ లోన్‌ రేట్‌ అవుతుంది.

Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్​ అందించే బ్యాంకులివే..!

ఇటీవల పండగల నేపథ్యంలో పలు బ్యాంకులు హోం లోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ప్రాసిసెంగ్ ఫీజును చాలా వరకు మాఫీ చేశాయి. సిబిల్ స్కోరును బట్టి హోం లోన్ వడ్డీ రేట్లలో రాయితీలు కూడా ప్రకటించాయి. ఇక ఇప్పుడు హోం లోన్లపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి..? రూ. 30 లక్షల లోన్‌పై 20 ఏళ్ల కాల వ్యవధిపై ఏ బ్యాంకులో ఈఎంఐ ఎలా ఉంది.? ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంది..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో హోం లోన్ వడ్డీ రేట్లు 8.60-9.65 శాతంగాఉన్నాయి. ఈఎంఐ రూ.26వేల 225-28వేల 258 గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.35 శాతం వరకు ఉంది. ప్రస్తుతం పండగ ఆఫర్ కింద మినహాయింపు ఉంది.
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 10.80 శాతంగా ఉంది. ఈఎంఐ రూ.25వేల 845-రూ.30వేల 558 గా ఉంది. లోన్ మొత్తంలో 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేట్లు 8.50 శాతం నుంచి 10.10 శాతంగా ఉండగా.. ఈఎంఐ రూ. 26,035 నుంచి రూ. 29,150 గా ఉంది. 2024, మార్చి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు లేదు.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోం లోన్ వడ్డీ రేటు 8.30 శాతం నుంచి 10.75 శాతంగా ఉంది. ఇక ఈఎంఐ విషయానికి వస్తే.. రూ. 25వేల 656 నుంచి రూ. 30వేల 457 గా ఉంది. 2023, డిసెంబర్ 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు లేదు.

RBI New Rules on Home Loans Save Big: ఇంటి కోసం బ్యాంకు లోన్​ తీసుకున్నారా..? లక్షల రూపాయలు ఆదా చేసుకోండిలా!

  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ రేటు 8.40-10.60 శాతంగా ఉంది. ఈఎంఐ రూ. 25వేల 845-రూ. 30వేల 153 గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు ప్రస్తుతానికి లేదు.
  • కెనరా బ్యాంకులో 8.40 శాతం నుంచి 11.25 శాతంగా హోం లోన్ వడ్డీ రేటు ఉంది. 25వేల 845-రూ. 31వేల 478 గా EMI ఉంది. 2023 సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిటైల్ లోన్ ఫెస్టివల్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ ఉంది.
  • ఇండియన్ బ్యాంకులో 8.40 శాతం నుంచి 10.20 శాతంగా వడ్డీ ఉంది. రూ. 25వేల 845- రూ. 29వేల 349 గా ఈఎంఐ ఉంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.25 శాతం వరకు ఉంది.
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హోం లోన్ వడ్డీ రేట్లు 8.40-9.95 శాతంగా ఉండగా.. ఈఎంఐ రూ. 25వేల 845-రూ.28,062గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు హోం లోన్ మొత్తంలో 0.50 శాతంగా ఉంది.
  • ఐడీబీఐ బ్యాంకు వడ్డీ రేట్లు 8.45-12.25 శాతంగా ఉంది. ఈఎంఐ రూ.25వేల 940-33వేల 557గా ఉంది. రూ. 5000 నుంచి రూ. 15 వేల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

Home Loans at Lowest Interest Rates : అతి తక్కువ వడ్డీతో.. హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

  • యూకో బ్యాంకులో హోం లోన్లపై వడ్డీ రేటు 8.45- 12.60 శాతంగా ఉంది. రూ.25వేల 940 నుంచి రూ. 34వేల 296 గా ఈఎంఐ ఉంది. 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు.
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గృహ రుణాలపై వడ్డీ రేటు 8.50-10.90 శాతంగా ఉండగా.. రూ.26,035-30,762 గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు లేదు.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 8.50 శాతం నుంచి 9.40 శాతం వరకు వడ్డీ ఉండగా.. ఈఎంఐ రూ. 26వేల 035 నుంచి రూ. 27వేల 768 గా ఉంది 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంది.
  • యాక్సిస్ బ్యాంకులో వడ్డీ రేట్లు 8.7 శాతంతో ప్రారంభం అవుతున్నాయి. ఈఎంఐ రూ. 26,416 గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో ఒక శాతంగా ఉంది.

ఫస్ట్​ టైం 'హోం లోన్' తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

హోమ్​ లోన్​కు అప్లై చేద్దామనుకుంటున్నారా?.. వీటిలో ఏది బెటర్​?

ఇంటి లోన్​ కోసం క్రెడిట్​ స్కోర్​ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ మీకోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.