Avoid These Mistakes to Maintain Good Credit Score: క్రెడిట్ స్కోర్.. లోన్లు తీసుకునే ప్రతి ఒక్కరికీ దీని గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఆర్థిక పరంగా చాలా కీలకం. ముఖ్యంగా పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్‌తోసహా.. ఎలాంటి రుణమైనా సజావుగా పొందడానికి క్రెడిట్ స్కోర్ ప్రధానం. మీరు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే.. లోన్ ఈజీగా పొందొచ్చు. మీ స్కోర్‌ను బట్టే.. ఎంత రుణం మంజూరు చేయాలి? వడ్డీ రేటు ఎంత? అనే అంశాలను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నిర్ణయిస్తాయి.
క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి?:
What is CIBIL Score: సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. మీకు ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే.. అంత మంచిది. సాధారణంగా.. 750 కంటే ఎక్కువ స్కోర్ ను మంచిగా పరిగణిస్తారు. ఇక్కడ రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఈ సింపుల్ టిప్స్‌తో పెంచుకోండిలా!
ఈ తప్పులు అస్సలు చేయొద్దు..:
- బకాయిలు ఆలస్యం చేయవద్దు..: మీరు మంచి సిబిల్ స్కోర్‌ను కొనసాగించాలనుకుంటే.. బిల్లులను గడువులోపు చెల్లించాలి. ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేస్తే.. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అది క్రెడిట్ కార్డ్ అయినా, తనఖా ద్వారా పొందిన రుణమైనా.. మరో అప్పు అయినా.. సకాలంలో చెల్లింపులు చాలా కీలకం. కాబట్టి.. గడువు తేదీలు దాటిపోకుండా రిమైండర్లు లేదా ఆటోమేటిక్ చెల్లింపులను సెటప్ చేసుకోండి.
- హైరిస్క్ లోన్లలో హామీగా ఉండడం : తెలిసిన వారు ఎవరైనా రుణాలు తీసుకుంటున్నప్పుడు.. చాలా మంది హామీ సంతకాలు చేస్తుంటారు. వాస్తవానికి ఇది మంచి పనే కావొచ్చు. కానీ.. రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైతే.. అది హామీగా ఉన్నవారి క్రెడిట్ స్కోర్ పైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి.. హామీ సంతకం చేయడానికి ముందు అన్నీ ఆలోచించండి.
ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా? స్కోరుపై ప్రభావం పడుతుందా? ఇలా చేయకూడదట!
- క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం: క్రెడిట్ కార్డ్ పరిమితిని పూర్తిగా ఎల్లప్పుడూ వినియోగించకూడదు. దీనివల్ల మీకు రుణం ఎక్కువగా అవసరం ఉందని సంస్థలు భావిస్తాయి. అదే సమయంలో అస్సలు వాడకపోయినా కూడా క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 30% వరకు వాడుకుంటే హెల్దీ స్కోర్ మెయింటెయిన్ అవుతుందని చెబుతున్నారు.
- ఎక్కువ దరఖాస్తులు : ఎక్కువ రుణాల కోసం.. ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేయడం మంచిది కాదు. క్రెడిట్ కార్డుల కోసం.. రుణాల కోసం బ్యాంకులు, ఇతర సంస్థలను సంప్రదించినప్పుడు.. రుణదాత మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తారు. దీన్ని "హార్డ్ ఎంక్వైరీ" అంటారు. ఇదే జరిగితే.. మీ సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోతుంది.
క్రెడిట్ కార్డ్ లేకున్నా మంచి క్రెడిట్ స్కోర్ పెంచుకోండిలా!
- పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం: మీ పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం మంచిదిగా అనిపించినప్పటికీ.. అది సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్రెడిట్ పరిమితి తగ్గిపోతుందట. పాత ఖాతాలను మూసివేయడం వల్ల క్రెడిట్ హిస్టరీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
- క్రెడిట్ రిపోర్ట్ పరిశీలన చేయకపోవడం: క్రెడిట్ రిపోర్ట్ ను క్రమం తప్పకుండా పరిశీలించాలి. మీ క్రెడిట్ స్కోరులో ఏవైనా లోపాలుంటే వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే.. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.