ETV Bharat / business

మరోసారి ఉద్యోగులను తొలగించిన అమెజాన్..​ 500 మంది భారతీయులు ఔట్​! - అమెజాన్ ఉద్యోగుల ఎందుకు తొలగిస్తోంది

అమెజాన్​ మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. భారత్​ నుంచి 500 మంది ఉన్నట్లు వెల్లడించింది. వెబ్‌ సర్వీసెస్‌, హ్యూమన్‌ రీసోర్సెస్‌, సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్ల నుంచి ఉద్యోగులను అమెజాన్​ తొలగించినట్లు తెలుస్తోంది.

amazon-layoffs-in-india-2023-why-amazon-laying-off-employees
అమెజాన్ తొలగింపులు 2023
author img

By

Published : May 16, 2023, 2:15 PM IST

Amazon Layoffs India 2023 : ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీ అమెజాన్‌.. మరోసారి సంస్థ నుంచి ఉద్యోగులను తొలగించింది. భారత్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చినెలలో అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న 9 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వెబ్‌ సర్వీసెస్‌, హ్యూమన్‌ రీసోర్సెస్‌, సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్ల నుంచి ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. అందులో కొందరు భారత్‌ నుంచి గ్లోబల్‌ ఆపరేషన్స్‌కు పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆర్థికవ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి, కంపెనీ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగులను తొలగించినట్లు అమెజాన్‌ సీఈఓ ఆండీ జస్సీ వివరించారు. ఉద్యోగులకు పంపిన ఆన్‌లైన్‌ నోటులో ఆండీ జస్సీ ఈ విషయాల్ని వెల్లడించారు. కరోనా తర్వాత వ్యాపార కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకోవడం వల్ల డిమాండ్‌ మళ్లీ తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.

కరోనా అనంతరం ఈ-కామర్స్‌ కంపెనీల.. ఆదాయ వృద్ధి కాస్త నెమ్మదించింది. మరోవైపు మహమ్మారి సంక్షోభ సమయంలో డిమాండ్‌ పెరగడం వల్ల అందుకు అనుగుణంగా భారీ ఎత్తున ఉద్యోగులను వివిధ సంస్థలు నియమించున్నాయి. ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాలకు డిమాండ్‌ తగ్గింది. మరోవైపు మాంద్యం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు విషయల్లోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు తమ వ్యయాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే మెటా, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. 2023 జనవరిలోనూ అమెజాన్‌ 18,000 మంది ఉద్యోగులను తొలగిచింది.

భారత్​లో 1000 మంది అమెజాన్‌ ఉద్యోగుల తొలగింపు పరిహారంగా 5 నెలల జీతం..
Amazon Layoffs India 2023 : జనవరి నెలలోను అమెజాన్.. భారత్​లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. తొలగించిన ఉద్యోగులకు ఐదు నెలల జీతాన్ని అమెజాన్‌ పరిహారంగా ఇస్తునట్లు పలు కథనాలు వెలువడ్డాయి. బెంగళూరు, గుడ్‌గావ్‌ కార్యాలయాల్లోని టెక్‌, మానవవనరులతోపాటు ఇతర విభాగాల్లో ఈ తొలగింపులు జరిగాయని తెలిసింది. ఈ మేరకు తొలగింపు సమాచారాన్ని ఈ-మెయిల్‌ ద్వారా తమకు తెలియజేసినట్లు కొందరు ఉద్యోగులు ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. తొలగించిన ఉద్యోగులకు ఐదు నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తామని అమెజాన్‌ ఈ-మెయిల్‌లో పేర్కొన్నట్లు వాళ్లు వాళ్లు చెప్పారు. అమెజాన్‌ నుంచి తొలగింపు సమాచారం అందుకున్న ఉద్యోగులు తమ విభాగాధిపతులతో సమావేశం కావాలని ఆ మెయిల్లో సంస్థ వెల్లడించినట్లు ఉద్యోగులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.