ETV Bharat / business

'బిగ్​బుల్'​ ఎయిర్‌లైన్​కు కీలక లైసెన్స్‌.. ఈ నెలలోనే సేవలు - ఆకాశ ఎయిర్​లైన్​

Akasa air news: కమర్షియల్‌ విమానాలు నడిపేందుకు కావాల్సిన లైసెన్సులు 'ఆకాశ ఎయిర్‌'కు అనుమతులు లభించాయి. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నుంచి ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ (ఏఓసీ) పొందినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

akasa air news
akasa air news
author img

By

Published : Jul 7, 2022, 8:43 PM IST

Akasa air news: బిగ్‌బుల్‌గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా మరికొందరితో కలిసి నెలకొల్పిన ఆకాశ ఎయిర్‌కు కీలక అనుమతులు లభించాయి. కమర్షియల్‌ విమానాలు నడిపేందుకు కావాల్సిన లైసెన్సులను ఆ కంపెనీ పొందింది. ఈ విషయాన్ని ఆకాశ ఎయిరే స్వయంగా గురువారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నుంచి ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ (ఏఓసీ) పొందినట్లు ఆకాశ ఎయిర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదో కీలక మైలురాయిగా అభివర్ణించిన ఆ సంస్థ.. త్వరలోనే కమర్షియల్‌ ఆపరేషన్స్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరులో తొలుత రెండు విమానాలతో సేవలు ప్రారంభిస్తామని పేర్కొంది. దశలవారీగా ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లనున్నట్లు తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 18 విమానాలతో సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత కూడా ఏటా విమానాల సంఖ్యను పెంచుకుంటూ వెళతామని కంపెనీ తెలిపింది.

ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ పేరిట విమాన సేవలు నిర్వహించనున్న ఆకాశ ఎయిర్‌ సంస్థ.. గతేడాది నవంబర్‌లో 72 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల కోసం ఆర్డర్‌ చేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ విమానాలు బోయింగ్‌ నుంచి కంపెనీకి అందనున్నాయి. మరోవైపు కమర్షియల్‌ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న ఆ సంస్థ.. సిబ్బందిని పెద్ద ఎత్తున రిక్రూట్‌ చేసుకుంటోంది. తాజాగా సిబ్బందికి సంబంధించిన యూనిఫామ్‌ను కూడా పరిచయం చేసింది.

ఇదీ చదవండి: ఈడీ దాడులతో 'వివో' హడల్.. చైనాకు డైరెక్టర్లు పరార్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.