Adani Hindenburg Case Verdict : అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెండింగ్‌లో ఉన్న మిగిలిన రెండు కేసులపై దర్యాప్తు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తును సెబీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి కేసు బదిలీ చేయాలన్న వాదనకు అర్థం లేదని తెలిపింది. అదానీ గ్రూప్‌పై మొత్తం 24 ఆరోపణలు రాగా అందులో 22 కేసుల్లో సెబీ దర్యాప్తు పూర్తైందని గుర్తు చేసిన ధర్మాసనం- సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో తలదూర్చే అధికారం సుప్రీంకోర్టుకు పరిమితంగానే ఉంటుందని వ్యాఖ్యానించింది. కోర్టు నియమించిన ప్యానెల్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం, సెబీ నడుచుకోవాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
'ఆ నివేదికలపై ఆధారపడలేం!'
థర్డ్ పార్టీలు ఇచ్చే నివేదికలను నిర్ణయాత్మక ఆధారాలుగా పరిగణించలేమని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిందని పిటిషనర్ విశాల్ తివారి పేర్కొన్నారు. ఆరోపణలు రుజువు చేసేందుకు పక్కా ఆధారాలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.
'సత్యమేవ జయతే'
కాగా, ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్వాగతించారు. సత్యమేవ జయతే అని పేర్కొన్నారు. 'సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సత్యం గెలిచింది. నా పక్షాన నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. భారతదేశ వృద్ధి ఇకపైనా కొనసాగుతుంది. దేశ వృద్ధికి మా గ్రూప్ తోడ్పాటు అందిస్తూనే ఉంటుంది' అని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
-
The Hon'ble Supreme Court's judgement shows that:
— Gautam Adani (@gautam_adani) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Truth has prevailed.
Satyameva Jayate.
I am grateful to those who stood by us.
Our humble contribution to India's growth story will continue.
Jai Hind.
">The Hon'ble Supreme Court's judgement shows that:
— Gautam Adani (@gautam_adani) January 3, 2024
Truth has prevailed.
Satyameva Jayate.
I am grateful to those who stood by us.
Our humble contribution to India's growth story will continue.
Jai Hind.The Hon'ble Supreme Court's judgement shows that:
— Gautam Adani (@gautam_adani) January 3, 2024
Truth has prevailed.
Satyameva Jayate.
I am grateful to those who stood by us.
Our humble contribution to India's growth story will continue.
Jai Hind.
అదానీ గ్రూప్ తన కంపెనీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని ఆరోపిస్తూ నాలుగు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారి, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అనామిక జైశ్వాల్ ఈ మేరకు పిటిషన్లు వేశారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తర్వాతే ఆ కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయాయని న్యాయవాదులు పేర్కొన్నారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడటం లేదని ఆరోపించారు.
దీనిపై విస్తృత వాదనలు ఆలకించిన ధర్మాసనం ఇటీవల తీర్పు రిజర్వ్ చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ చేసిన విచారణను తప్పుబట్టాల్సిన అవసరం లేదని ఆ సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదికలో ఉన్న వివరాలను వాస్తవాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. షేర్ల ధరల్లో అస్థిరత వల్ల భవిష్యత్‌లో ఇన్వెస్టర్లు నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పాలని సెబీని ఆదేశించింది.
అయితే, ఈ విషయంలో సెబీ పాత్రపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అనుమానాలు వ్యక్తం చేశారు. 2014కు ముందు నుంచే సెబీ వద్ద చాలా సమాచారం ఉందని తెలిపారు. సెబీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పిటిషనర్ల వాదనలను ఖండించారు. భారత్‌లో విధానాలను ప్రభావితం చేసేందుకు విదేశాల్లో కథనాలు సృష్టించడం ఇటీవల పెరిగిపోయిందని ఆరోపించారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన 24 ఆరోపణలు రాగా అందులో 22 అంశాల్లో దర్యాప్తు పూర్తైందని చెప్పారు.