Hero Glamour 2023 Launch in India : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన అనేక మోడళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో స్ల్పెండర్ తర్వాత గ్లామర్ ఉంటుంది. అలాగే కుర్రకారు బాగా ఇష్టపడే ద్విచక్రవాహనాల్లో హీరో గ్లామర్(Hero) ముందుంటుంది. మార్కెట్లో ఈ బైక్‌కి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. దానిని అందిపుచ్చుకునేందుకు ఈ గ్లామర్‌ను మరికొన్ని అదిరిపోయే ఫీచర్లతో అప్ గ్రేడెడ్ వర్షన్‌గా 'గ్లామర్ 2023'(Hero Glamour 2023) పేరుతో ఈ నయా బైక్‌ను హీరో కంపెనీ రీ లాంచ్ చేసింది. ప్రస్తుతం రెండు వేరియంట్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ అప్డేటెడ్ గ్లామర్ బైక్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, వేరియంట్స్, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డిజైన్(Hero Glamour 2023 Design) : హీరో మోటోకార్ప్ కొత్తగా విడుదల చేసిన 2023 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. పూర్తి డిజిటలైజ్ వెర్షన్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఈ బైక్‌ను రూపొందించారు.
ధర & వేరియంట్లు(2023 Hero Glamour Price) : ప్రస్తుతం 2023 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. హీరో గ్లామర్ 'డ్రమ్' వేరియంట్ ధర రూ. 82,348 (ఎక్స్-షోరూమ్)గా ఉండగా.. హై-స్పెక్ 'డిస్క్' వేరియంట్ ధర రూ. 86,348 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
పవర్‌ట్రెయిన్ : కొత్త 2023 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్‌లో 125cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇందులోని ఇంజన్ 7,500rpm వద్ద 10.68bhp, 6,000rpm వద్ద 10.6Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిలో i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. ఈ ఇంజిన్ కూడా తాజా BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇది E20 ఇంధనంతో కూడా పనిచేసేలా నిర్మించారు. ఇది లీటరుకి 63కిలోమీటర్ల మైలేజీనిచ్చే ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
ఫీచర్లు(2023 Hero Glamour Features) : 2023 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ ఎలక్ట్రిక్ స్టార్టర్, అల్లాయ్ వీల్స్, USB ఛార్జింగ్ పోర్ట్, కొత్త పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంకు, రియల్ టైమ్ మైలేజ్, లో ఫ్యూయల్ ఇండికేటర్ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఇతర మార్పులు : హీరో మోటోక్రాప్ ఈ బైక్ సీటు ఎత్తును రైడర్ స్థానంలో 8mm, వెనక ప్రయాణికుడి స్థానాన్ని 17mm తగ్గించింది. ఈ మార్పుతో హీరో గ్లామర్‌పై సీటు కాస్త పొడవుగా కనిపిస్తుంది. గ్రాబ్‌రెయిల్‌తో కూడిన సింగిల్ పీస్ సీటు, కొత్త రూపంలో అలాయ్ చక్రాలు.. ఈ బైక్ డిజైన్‌లో వచ్చిన ఇతర ప్రధాన మార్పులు. సమర్థవంతమైన స్టైలిష్‌గా కనిపించే 125cc కమ్యూటర్ మోటార్‌సైకిల్ కోసం వెతుకుతున్న వారికి కొత్త 2023 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు. అలాగే, తక్కువ సీటు ఎత్తు, అప్‌డేట్ చేయబడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మార్పులు కస్టమర్లను మరింత ఆకర్షిస్తాయని హీరో కంపెనీ భావిస్తోంది.
Bikes Launched In October 2023 : స్టన్నింగ్ ఫీచర్స్‌తో.. సూపర్ బైక్స్ లాంఛ్.. ధర ఎంతంటే?