ETV Bharat / business

బేర్​ మార్కెట్లంటే ఏంటి? వీటితో నష్టమా.. లాభమా? - బుల్​ వర్సెస్ బేర్

అమెరికా సూచీలు బేర్‌ మార్కెట్‌ పరిధిలోకి వెళ్లాయి. నిఫ్టీ బేర్‌ మార్కెట్లోకి చేరింది. ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్లను విపరీతంగా భయపెడుతున్న అంశాలు ఇవి. అసలు బేర్‌ మార్కెట్లని వేటిని అంటారు? వాటి ప్రభావం సూచీలపై ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. అవేంటో చూద్దాం.

bear market
బేర్ మార్కెట్
author img

By

Published : Mar 12, 2020, 2:56 PM IST

నేడు ఉదయం దేశీయ మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరగడం వల్ల సూచీలు బేర్‌మార్కెట్‌ పరిధిలోకి వెళ్లాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత పలు దేశాల సూచీలు పతనం కావడం.. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా దారుణంగా పడింది.

బేర్‌ మార్కెట్లు అంటే?

సాధారణంగా అమ్మకాలు ఎక్కువగా జరిగే వాటిని బేర్‌ మార్కెట్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ, ఒక స్టాక్‌ గానీ, సూచీ గానీ ఇటీవల అత్యధికంగా ట్రేడైన మార్క్‌ నుంచి 20 శాతం కిందికి పడిపోతే దానిని బేర్‌ మార్కెట్లుగా పేర్కొంటారు. ఇది మార్కెట్లో బలమైన ప్రతికూల సెంటిమెంట్‌ను తెలియజేస్తుంది. సూచీలు లేదా స్టాక్‌లో భారీ అమ్మకాలకు ఇది సూచిక.

భారత మార్కెట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి..?

జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ఇప్పుడు బేర్‌ మార్కెట్లోకి చేరింది. ఇక బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్‌ కూడా బేర్‌ మార్కెట్లకు వెంట్రుకవాసి దూరంలో ఉంది. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఆటో, నిఫ్టీ సీపీఎస్‌ఈలు ఇప్పటికే బేర్‌మార్కెట్లోకి చేరిపోయాయి. ఇవన్నీ ఇటీవల కాలంలో ట్రేడైన అత్యధిక మొత్తం కంటే 20శాతం పైగా కుంగాయి.

అమెరికా స్టాక్‌ మార్కెట్ల పరిస్థితి ఏంటి?

అమెరికాలోని ఎస్‌ అండ్‌ పీ- 500 ఫ్యూచర్స్‌ మార్కెట్లో 3 శాతం పడగా.. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 4.89శాతం పతనమైంది. ఫలితంగా ఇది బేర్‌ మార్కెట్లోకి చేరిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం ముగిసిన తర్వాత దీనికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. జపాన్‌ కూడా బేర్‌ మార్కెట్లలో చేరిపోయింది. ఈ దేశ సూచీ నిక్కీ 5.2 శాతం విలువ కోల్పోయి 2017 ఏప్రిల్‌ నాటి స్థాయికి చేరింది.

గతంలో, ప్రస్తుత బేర్‌ మార్కెట్లకు కారణాలు?

బేర్‌ మార్కెట్‌ పరిస్థితులు ఏర్పడటానికి పలు కారణాలు ఉన్నాయి. ఒక్కోసారి సంక్షోభానికి ఒక్కో కారణం ఉంది. 1980ల్లో బేర్‌ మార్కెట్లకు అధిక వడ్డీరేట్లు, పెరిగిన ద్రవ్యోల్బణం కారణమైంది. అదే 2,000 సంవత్సరంలో బేర్‌ మార్కెట్లకు టెక్‌బబుల్‌ సంక్షోభం కారణంగా నిలిచింది. ఇక అమెరికాలో హౌసింగ్‌ సంక్షోభం రావడం వల్ల 2008లో మార్కెట్లు పాతాళాన్ని చూశాయి. 2020లో కరోనా వైరస్‌, వాణిజ్య యుద్ధం, చమురు యుద్ధాలు మార్కెట్లను ముంచేశాయి. భారత్‌లో అయితే బ్యాంకింగ్‌ రంగ సంక్షోభం కూడా దీనికి తోడైంది.

ఇది నష్టమా.. లాభమా..?

ప్రస్తతం మదుపరుడు ఉన్న పరిస్థితిని బట్టి ఇది ఉంటుంది. ఇప్పటికే మార్కెట్​లో ఉండి.. షేర్లను కొనుగోలు చేసి ఉంటే మాత్రం నష్టపోవడం ఖాయం. ఎందుకంటే ఆ షేర్లపై వచ్చిన లాభాలు ఇప్పటికే ఆవిరైపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిని కూడా అమ్మితే అతి కష్టం మీద అసలు వస్తుంది.

అదే మీరు దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయితే ఇది ఒక అవకాశంగా నిలుస్తుంది. మంచి కంపెనీల షేర్లను తక్కువ రేటుకు కొనుగోలు చేయవచ్చు. గతంలో వారెన్‌ బఫెట్‌ సహచరుడు చార్లీ ముంగెర్‌ 2008లో సంక్షోభ సమయంలో అతితక్కువ ధరలకు బ్యాంకింగ్‌ రంగ షేర్లు కొనుగోలు చేసి లాభపడ్డారు. కానీ, అప్రమత్తంగా లేకపోతే మాత్రం పూర్తిగా నష్టపోవడం ఖాయం.

ఇదీ చూడండి: బేర్​ గుప్పిట్లో మార్కెట్లు- రికార్డు పతనాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.