ETV Bharat / business

Union Bank: నష్టాల ఊబిలో నుంచి లాభాల బాటలోకి... - యూనియన్‌ బ్యాంకు లాభాలు

యూనియన్‌ బ్యాంకు నష్టాల నుంచి గట్టెక్కి లాభాల్లోకి వచ్చింది. గత ఆర్థిక ఏడాదిలో ఏకంగా రూ.2,906 కోట్లు మేర నిఖర లాభాలను ఆర్జించినట్లు యూనియన్‌ బ్యాంకు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.6,613 కోట్లు నష్టాల్లో ఉన్న ఈ బ్యాంకు నిరర్ధక ఆస్తులు తగ్గించుకోవడం, వడ్డీ రాబడులు పెరగడం, నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం వల్ల లాభాల్లోకి తీసుకురాగలిగినట్లు స్పష్టం చేసింది.

union bank in to profits from losses
union bank in to profits from losses
author img

By

Published : Jun 8, 2021, 4:28 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న యూనియన్‌ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు ఈ మూడు బ్యాంకులు విలీనం ప్రక్రియ పూర్తవడం వల్ల ఖాతాదారులందరు యూనియన్‌ బ్యాంకు కిందకు వచ్చారు. ఈ ఏడాది మార్చి చివర నాటికి సాంకేతికపరంగా కూడా పూర్తి స్థాయిలో మార్పులు జరగడం వల్ల ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలుగుతున్నట్లు యూనియన్‌ బ్యాంకు అధికారులు తెలిపారు. మూడు బ్యాంకులు విలీనమైన తరువాత దేశవ్యాప్తంగా 9,312 బ్యాంకు బ్రాంచీలు, 12,957 ఏటీఎంలు, 8,214 బిజినెస్‌ సెంటర్లతో యూనియన్‌ బ్యాంకు నడుస్తోంది. 2019-20 ఆర్థిక ఏడాదిలో ఈ బ్యాంకు రూ.6,613 కోట్లు మేర నిఖర నష్టాలను చవి చూసింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో కాసా డిపాజిట్లు 13.15 శాతం పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి ఆ డిపాజిట్లు మొత్తం రూ. 9,23,805 కోట్లుకు చేరింది. దీంతో.. కాసా రేషియో 34.15 శాతం నుంచి 36.33 శాతానికి మెరుగైంది.

2019-20లో రూ. 25,147 కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తుల్లో ఏకంగా 30.63శాతం అంటే రూ.7704 కోట్లు వసూలై...2020-21 ఆర్థిక ఏడాది ముగిసే నాటికి నిరర్ధక ఆస్తుల విలువ రూ.17,443 కోట్లుకు తగ్గింది. దీంతో గత ఆర్థిక ఏడాది నిరర్ధక ఆస్తులు 4.62 శాతానికి పడిపోయింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో రూ.18,076 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆదాయం గత ఏడాదిలో రూ.19,259 కోట్లుకు పెరిగింది. 6.54 శాతం వృద్ధి సాధించి రూ.1183 కోట్లు రాబడిని తెచ్చి పెట్టింది. 2019-20 ఆర్థిక ఏడాది నిఖర వడ్డీ రాబడి 23,654 కోట్లు ఉండగా గత ఆర్థిక ఏడాదిలో అది రూ.24,688 కోట్లకు చేరింది. ఇక్కడ కూడా 4.37శాతం వృద్ది సాధించి రూ 1,034 కోట్లు రాబడిని తెచ్చి పెట్టింది.

ఇక 2020-21 ఆర్థిక ఏడాదిలో నిర్వహణ లాభాలు ఏకంగా 40.38శాతం పెరిగాయి. అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో రూ.6613 కోట్లు నష్టం చవిచూసిన బ్యాంకు గత ఆర్థిక ఏడాది రూ.2,906 కోట్లు లాభాల్లోకి వచ్చింది. నిఖర వడ్డీ రాబడి 4.37శాతం పెరిగినట్లు బ్యాంకు వెల్లడించింది. వ్యక్తిగత, గృహ తదితర వ్యవసాయేతర రుణాలు 10.49శాతం, వ్యవసాయ రుణాలు 11.89శాతం, ఎంఎస్‌ఎంఈ రుణాలు 3.24శాతం లెక్కన వృద్ధి కనబరచి సగటు రుణాల వృద్ది 3.11శాతం నమోదు చేసింది. ఈ మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు బ్యాంక్ ఖాతాలను ఆమోదించింది.

ఇదీ చూడండి: టీకా తీసుకుంటే ఎఫ్​డీపై అధిక వడ్డీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.