స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 50 వేలకు ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 14 వేల 814 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులు, కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళనలు ఉన్నా... ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలోపేతం లాభాలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్,టీసీఎస్, షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎన్టీపీసీ,ఓఎన్జీసీ, కోటక్ మహేంద్ర బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.