ETV Bharat / business

టీసీఎస్​ ఎం-క్యాప్ ​@రూ. 12లక్షల కోట్లు

స్టాక్ మార్కెట్లలో గురువారం టీసీఎస్ షేరు లాభాలు ఆర్జించింది. దీంతో కంపెనీ ఎం-క్యాప్​ రూ.12లక్షల కోట్ల మార్కును దాటింది. రిలయన్స్ తర్వాత దేశంలో అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్​ అవతరించింది.

TCS' market valuation crosses Rs 12 lakh cr-mark
రూ.12లక్షల కోట్ల మార్కును దాటిన టీసీఎస్
author img

By

Published : Jan 14, 2021, 9:39 PM IST

గురువారం స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ అదరగొట్టింది. షేరు ధర 2.89శాతం పుంజుకోవడం వల్ల సంస్థ మూలధన విలువ రూ.12లక్షల కోట్లు దాటింది. రిలయన్స్ తర్వాత ఆ మార్క్​ను దాటిన తొలి దేశీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది.

బీఎస్​ఈలో టీసీఎస్​ షేరు 2.89శాతం పెరిగి వృద్ధితో రూ.3,250 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మొత్తం విలువ రూ.12,19,581.32 కోట్లకు చేరింది. టీసీఎస్ షేర్లు జనవరిలో ఇప్పటి వరకు 13 శాతం మేర వృద్ధి సాధించడం విశేషం.

ప్రస్తుతం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్​ దేశీయంగా అతిపెద్ద ఎం- క్యాప్​ లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతోంది. టీసీఎస్​ రెండో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: చెప్పినట్టే భారత్​ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాం: టెస్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.