ETV Bharat / business

మార్కెట్లకు ఏజీఆర్​ దెబ్బ- నాలుగో రోజూ నష్టాలే - స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 161 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు కోల్పోయాయి. ఏజీఆర్​ బకాయిల వ్యవహారం నేపథ్యంలో టెలికాం, బ్యాంకింగ్​ రంగాలు భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల ప్రభావమూ తోడయింది.

stock, bse, nse
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Feb 18, 2020, 3:46 PM IST

Updated : Mar 1, 2020, 5:53 PM IST

స్టాక్​ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 161 పాయింట్లు కోల్పోయి 40,894 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 11,992 పాయింట్లకు చేరుకుంది.

సెషన్​ మధ్యలో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒకానొక దశలో 444 పాయింట్లు కోల్పోయి సెన్సెక్స్​ 40,610.95 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 160 పాయింట్లకుపైగా నష్టపోయింది.

లాభ నష్టాల్లో..

కోల్​ఇండియా, బీపీసీఎల్​, గెయిల్​, అదానీ పోర్ట్స్​, ఎస్బీఐ, ఇన్ఫోసిస్​, పవర్​గ్రిడ్​, టీసీఎస్​, బజాజ్​ ఆటో లాభాలు సాధించాయి.

బజాజ్​ ఫైనాన్స్​, సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హీరో మోటోకార్ప్​, మారుతి సుజుకి, భారతి ఎయిర్​టెల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నష్టపోయాయి.

ఏజీఆర్​ బకాయిలు..

ఏజీఆర్​ బకాయిల విషయంలో వొడాఫోన్ ఐడియాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చర్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో టెలికాం, బ్యాంకింగ్ రంగాలు భారీగా నష్టపోయాయి. వొడాఫోన్​ ఐడియా షేర్లు 16 శాతం పడిపోయాయి.

ఆసియా మార్కెట్లు కుదేలు..

కరోనా వైరస్​ మరణాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. ఆర్థిక వృద్ధిపై కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్​ కారణంగా ఇప్పటివరకు 1,868 మంది మరణించారు. కరోనా సోకిన వారి సంఖ్య 72,436కు చేరుకుంది.

Last Updated : Mar 1, 2020, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.