ETV Bharat / business

దేశీయ సూచీలకు లాభాలు- 13 వేలకు చేరువలో నిఫ్టీ - స్టాక్ మార్కెట్ లైవ్ వార్తలు

STOCKS
దేశీయ మార్కెట్లు
author img

By

Published : Nov 26, 2020, 9:35 AM IST

Updated : Nov 26, 2020, 4:28 PM IST

16:27 November 26

చివరికి లాభాలే..

స్టాక్​మార్కెట్​ సూచీలు ఇవాళ తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడింగ్​ సాగించాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా.. చివరకు మాత్రం భారీ లాభాల్లో ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 432 పాయింట్లు పెరిగింది. చివరకు 44 వేల 259 వద్ద సెషన్​ను ముగించింది. ఆరంభంలో ఈ సూచీ దాదాపు 250 పాయింట్ల మేర నష్టపోయి.. 43 వేల 582 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం.. పుంజుకొని పరుగులు పెట్టింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 12 వేల 987 వద్ద స్థిరపడింది.

మొత్తం 1726 షేర్లు పెరిగాయి. 986 షేర్లు క్షీణించాయి. 179 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

లాభనష్టాల్లోనివివే..

నేటి సెషన్​లో లోహరంగం షేర్లు అత్యధికంగా రాణించాయి. జేఎస్​డబ్ల్యూ స్టీల్ 6 శాతానికిపైగా పెరిగింది.

​టాటా స్టీల్​, గ్రేసిమ్​, హిందాల్కో, బజాజ్​ ఫినాన్స్​, యాక్సిస్​ బ్యాంక్​ లాభాల్లో ముగిశాయి.

ఐచర్​ మోటార్స్​, బీపీసీఎల్​, మారుతీ సుజుకీ, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ నష్టపోయాయి.

11:54 November 26

ఊగిసలాట మధ్య మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 134 పాయింట్ల నష్టంతో 43,695 పాయింట్ల వద్ద ట్రేడవుతోది.  

నిఫ్టీ 38 పాయింట్ల క్షీణించి 12,820 పాయింట్ల వద్ద కొనగసాగుతోంది.  

నవంబర్ డెరివేటివ్​ల ముగింపు రోజు కావటం వల్ల మదుపరులు అప్రమత్తతగా వ్యవహరిస్తున్నారు.  ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.  

లాభనష్టాల్లో..  

మహీంద్ర అండ్ మహీంద్ర, హెచ్​సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్​ ఆటో షేర్లు 1 శాతం మేర లాభపడ్డాయి.  

మారుతి, ఇన్ఫోసిస్, ఇండస్​ఇండ్ బ్యాంక్, టెక్​మహీంద్ర, పవర్​గ్రిడ్​ నష్టాల్లో ఉన్నాయి.  

09:08 November 26

స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 62 పాయింట్ల లాభంతో 43,890 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

నిఫ్టీ 17 పాయింట్లు మెరుగై 12,875 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..  

బజాజ్ ఆటో, ఎల్​అండ్​టీ, మహీంద్ర అండ్ మహీంద్ర, టైటాన్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్​ సిమెంట్ లాభాల్లో ఉన్నాయి.  

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్​ ఫినాన్స్, ఎస్​బీఐ, నెస్లే, బజాజ్ ఫిన్​సర్వ్​ షేర్లు వెనకబడ్డాయి.  

Last Updated : Nov 26, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.