స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 287 పాయింట్లు కోల్పోయి 59,126 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 17,618 వద్దకు చేరింది. మార్కెట్లు నష్టాలతో ముగియటం వరుసగా ఇది మూడో సెషన్.
- బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను గడించాయి.
- పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు స్వల్ప లాభాలను గడించాయి. నిక్కీ (జపాన్), హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.