ఆరంభంతో పోలిస్తే స్టాక్ మార్కెట్ల నష్టాలు కాస్త తగ్గాయి. సెన్సెక్స్ 280 పాయింట్లకుపైగా నష్టంతో 55,348 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా క్షీణించి 16,460 వద్ద కొనసాగుతోంది.
లోహ, ఫార్మ, బ్యాంకింగ్ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.
- హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్ లాభాల్లో ఉన్నాయి.
- టాటా స్టీల్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్&టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.