ETV Bharat / business

వరుసగా నాలుగో సెషన్​లో లాభాల జోరు- సెన్సెక్స్ 533 ప్లస్ - స్టాక్​ మార్కెట్లు

Stock Market Closing: స్టాక్​ మార్కెట్లు కొద్దిరోజులుగా దూసుకెళ్తున్నాయి. బుధవారం ట్రేడింగ్​లోనూ భారీగా పెరిగాయి. సెన్సెక్స్​ 500, నిఫ్టీ 150 పాయింట్లకుపైగా లాభపడ్డాయి.

STOCKS CLOSING BELL
STOCKS CLOSING BELL
author img

By

Published : Jan 12, 2022, 3:39 PM IST

Stock Market Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు జోరుమీదున్నాయి. వరుసగా నాలుగో సెషన్​లోనూ భారీ లాభాలు నమోదు చేశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 533 పాయింట్లు పెరిగింది. చివరకు 61 వేల 150 వద్ద స్థిరపడింది.

లాభాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ వెనక్కితగ్గలేదు. సెన్సెక్స్​ ఇంట్రాడేలో 600 పాయింట్లకుపైగా పెరిగి 61 వేల 218 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 157 పాయింట్లు పెరిగి.. 18 వేల 212 వద్ద సెషన్​ను ముగించింది.

లోహ, విద్యుత్​, ఆటో, రియల్టీ రంగం షేర్లు 1 నుంచి 2 శాతం మేర పెరిగాయి. ఐటీ, ఫార్మా షేర్లు ఫ్లాట్​గా ముగిశాయి.

మొత్తంగా బుధవారం ట్రేడింగ్​లో 1694 షేర్లు లాభపడ్డాయి. 1554 షేర్లు నష్టపోయాయి.

లాభనష్టాల్లో ఇవే..

సెన్సెక్స్​ 30 ప్యాక్​లో ఎం అండ్​ ఎం అత్యధికంగా 4 శాతానికిపైగా లాభపడింది. భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​, ఓఎన్​జీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ కూడా రాణించాయి.

టైటాన్​ కంపెనీ, టీసీఎస్​, శ్రీ సిమెంట్స్​, బ్రిటానియా, సిప్లా డీలాపడ్డాయి.

ఇవీ చూడండి: భారత్​ నుంచి అమెరికాకు మామిడి... అక్కడ నుంచి మనకు పంది మాంసం!

అంబానీని మించిన జావో- ప్రపంచ కుబేరుడైన క్రిప్టో బిలియనీర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.