అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, దేశీయ విపణిలోకి విదేశీ వ్యవస్థీకృత మదుపరుల పెట్టుబడి కొనసాగింపు, చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చే దిశగా బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో 38వేల 334 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 29 పాయింట్ల వృద్ధితో 11వేల 370 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్నవి ఇవే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హీరో మోటర్ కార్ప్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, సన్ ఫార్మాషేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు..
ఇన్ఫోసిస్, జెఎస్డబ్ల్యూ స్టీల్, జీ లిమిటెడ్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
క్షీణించిన రూపాయి...
డాలరు మారకంతో పోల్చితే రూపాయి విలువ 10 పైసలు క్షీణించి 71.33 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: రూ.8వేలలోపు ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ఫోన్లు ఇవే..!