ETV Bharat / business

వీడని సంక్షోభం భయాలు- మార్కెట్లకు నష్టాలు

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 470 పాయింట్లు కోల్పోయి.. 48,564 వద్దకు చేరింది. నిఫ్టీ 152 పాయింట్లు తగ్గి..14,281 వద్ద స్థిరపడింది.

stock markets registered huge losses on monday closing session
కుప్పకూలిన సూచీలు- సెన్సెక్స్​ 470 మైనస్​
author img

By

Published : Jan 18, 2021, 3:46 PM IST

Updated : Jan 18, 2021, 3:55 PM IST

చైనా బలమైన ఆర్థిక వృద్ధి నమోదు చేసినా... అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంపై నెలకొన్న ఆందోళనల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఊగిసలాట ధోరణిలో ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు.. సమయం గడిచేకొద్దీ నష్టాల్లోకి జారుకొన్నాయి. సోమవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 470 పాయింట్లు కోల్పోయి 48,564 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 152 పాయింట్లు తగ్గి 14,281 వద్ద స్థిరపడింది. వినియోగదారు వస్తువులు, ఇంధన రంగాలు తప్ప మిగిలిన సూచీలు మొత్తం నష్టాలు మూటకట్టుకున్నాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 49,122 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,403 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,459 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,222 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

రిలయన్స్​, ఐటీసీ, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, సన్​ఫార్మా​, ఓఎన్​జీసీ, బజాజ్​ ఫైనాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, పవర్​ గ్రిడ్​ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఇదీ చూడండి: తొలిసారి ఐపీఓకు ప్రభుత్వ రంగ ఎన్​బీఎఫ్​సీ

Last Updated : Jan 18, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.