స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex today) 109 పాయింట్లు కోల్పోయి 60,029 వద్ద సెషన్‌ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ(Nifty today) 40 పాయింట్ల నష్టంతో 17,889 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
సోమవారం సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇదే జోరు ఉదయం సెషన్లో కొనసాగింది. సెన్సెక్స్ 60,421 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. అయితే మిడ్ సెషన్లో మదుపర్లు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల.. సెన్సెక్స్ సుమారు 400 పాయింట్లు నష్టపోయింది. 59,882 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 18,012 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,848 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాలు..
మారుతి, టైటాన్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, సన్‌ఫార్మా షేర్లు లాభాలను గడించాయి.
టాటా స్టీల్, టెక్ మహీంద్ర, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాలను చవిచూశాయి.