బడ్జెట్ తర్వాత దేశీయ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, హెవీ వెయిట్ షేర్ల దన్నుతో మంగళవారమూ భారీ లాభాలతో సాగుతున్నాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 51,753 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 363 పాయింట్ల లాభంతో 51,712 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సైతం దూసుకెళుతోంది. 110 పాయింట్ల వృద్ధితో 15,226 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లోనివి..
ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, టైటాన్ కంపెనీలు 3 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఐఓసీ, ఎంఅండ్ఎం, టాటా మోటర్స్, బజాజ్ ఆటో, జేఎస్ డబ్ల్యూ స్టీల్లు సుమారు 2 శాతం మేర నష్టాల్లోకి వెళ్లాయి.