లాభాల్లో మార్కెట్లు..
మంగళవారం మధ్యాహ్నం వరకు నష్టాల్లో ట్రైడ్ అయిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, టెలికాం షేర్ల దూకుడుతో లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 345 పాయింట్లు వృద్ధి చెంది 45,899 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు బలపడి 13,441 వద్ద ట్రేడ్ అవుతోంది.
హెచ్‌సీఎల్ టెక్, టెక్ఎమ్, ఇన్ఫీ, భారతీ ఎయిర్‌టెల్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.