44,650 దిగువకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు కోల్పోయి 44,618 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ అతి స్వల్పంగా 5 పాయింట్లు పెరిగి 13,114 వద్ద స్థిరపడింది.
లోహ, చమురు, ఆటో, ఐటీ షేర్లు సానుకూలంగా ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి.
- ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఎం&ఎం షేర్లు లాభాలను నమోదు చేశాయి.
- కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.