స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండటం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఉత్సాహకరమైన సంకేతాలు అందుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 50 వేల మార్క్‌ను చేరింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 750 పాయింట్లు పెరిగింది. చివరకు 49,850 వద్ద సెషన్‌ను ముగించింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 232 పాయింట్లు వృద్ధి చెంది.. 14,762 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో..
పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, కోటక్‌బ్యాంక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు రాణించాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో భారతీ ఎయిర్టెల్ మాత్రమే నష్టపోయింది.