ETV Bharat / business

చమురు ధరల పతనంతో కుప్పకూలిన మార్కెట్లు - LATEST MARKET NEWS

stocks
స్టాక్స్​
author img

By

Published : Apr 21, 2020, 9:21 AM IST

Updated : Apr 21, 2020, 4:56 PM IST

15:53 April 21

చమురు ధరలు భారీగా పతనం కావడం, అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. తమ దేశంలోకి వలసల్ని తాత్కాలికంగా నిషేధించనున్నామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన కూడా మార్కెట్ల పతనానికి ఓ కారణమైంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,011 పాయింట్ల నష్టంతో 30,636 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 280 పాయింట్లు క్షీణించి..8,981 వద్ద ముగిసింది.

లాభాల్లో..

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, ఇన్‌ఫ్రాటెల్‌, భారతీ ఎయిర్​టెల్​, బ్రిటానియా షేర్లు లాభాలతో ముగించాయి.

నష్టాల్లో...

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు దాదాపు 12 శాతం నష్టపోయాయి. బజాజ్​ఫైనాన్స్​, జీల్​, హిందాల్కో, యాక్సిస్​ బ్యాంకు షేర్లు నష్టాలు చవిచూశాయి.

రూపాయి....

డాలరుతో పోలిస్తే రూపాయి 30 పైసలు క్షీణించి రూ.76.83 వద్ద నిలిచింది.

చమురు పతనం...

చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా తొలిసారిగా సోమవారం బ్యారల్‌ ధర ఓ దశలో -37.63 డాలర్లకు తగ్గిపోయింది. అంటే సరకు వదిలించుకోవడానికి విక్రేతే కొన్నవారికి ఎంతోకొంత ఎదురు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు ఏమాత్రం గిరాకీ లేకుండా పోయింది. కర్మాగారాలూ మూతపడ్డాయి. చమురు డిమాండ్‌ భారీగా తగ్గింది. ఉత్పత్తిలో మాత్రం కోత పెట్టలేదు. పైగా ఆ మధ్య రష్యా, ఒపెక్‌ దేశాల మధ్య ధరలపోరు నడవడం వల్ల పోటాపోటీగా ఉత్పత్తిని పెంచాయి. ప్రస్తుతం వీరి మధ్య ఒప్పందం కుదరడం వల్ల ధరల యుద్ధం సమస్య సమసిపోయింది. రోజుకు 9.7 మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించాయి. కానీ, అది మే 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో ప్రస్తుతం డిమాండ్‌, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది.

15:35 April 21

భారీ పతనం...

చమురు ధరలు భారీగా పతనమవడం వల్ల స్టాక్​ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,011 పాయింట్ల నష్టంతో 30,636 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 280 పాయింట్లు క్షీణించి.. 8,981 వద్ద ముగిసింది.

10:48 April 21

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా పతనమవడం వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  ప్రారంభంలో 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 868 పాయింట్ల క్షీణతతో 30,779 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 240 పాయింట్లు కోల్పోయి 9021 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

30 షేర్ సూచీ సెన్సెక్స్​లో సన్​ఫార్మా, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హీరో, పవర్ గ్రిడ్, ఎల్​ అండ్ టీ, భారతీ ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎన్​టీపీసీ సహా 25 సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి క్షీణత..

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 26 పైసలు క్షీణించి 76.79 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు.. తొలిసారిగా మైనస్​లోకి

ముడి చమురు ధరలు చరిత్రలో తొలిసారి మైనస్​ విలువల్లోకి పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ఫ్యూచర్స్​ విలువ క్షీణించిన నేపథ్యంలో తాజా నష్టాలు నమోదయ్యాయి.

మే నెల చమురు కాంట్రాక్టుకు సంబంధించి అమెరికాకు చెందిన వెస్ట్‌టెక్సాస్‌ మధ్యంతర ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో ధరలు సున్నా కంటే దిగువకు పడిపోయి -37. 63 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. చమురు కొనేందుకు కొనుగోలుదారుల్లో ఆసక్తి లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే మంగళవారం జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో ట్రేడింగ్​ చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపిన నేపథ్యంలో బ్యారెల్ ముడిచమురు ధర నేడు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 21 డాలర్ల వద్ద ఉంది. 

09:31 April 21

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 890 పాయింట్లు క్షీణించి 30,757 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 280 పాయింట్లు కోల్పోయి 8,981 వద్ద కొనసాగుతోంది. 

09:19 April 21

మార్కెట్లకు చమురు దెబ్బ- నష్టాల్లో మార్కెట్లు

కరోనా సంక్షోభం, ముడి చమురు ధరల పతనం నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 780 పాయింట్లు క్షీణించి 30,865 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 9,035 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరలు చరిత్రలో తొలిసారి మైనస్​లోకి పతనమయ్యాయి. మే నెల కాంట్రాక్టుకు సంబంధించి అమెరికా బెంచ్‌మార్క్‌ వెస్ట్‌టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో ధరలు సున్నా కంటే దిగువకు పడిపోయాయి. ఇంతటి భారీ పతనంతో మదుపర్లలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Apr 21, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.