కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఖాయమన్న ఆందోళనల మధ్య స్టాక్మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో 41 వేల 225 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12 పాయిట్లు తగ్గి 12,101 వద్ద కొనసాగుతోంది.
నష్టాల్లో...
ఎంఅండ్ఎం, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ నష్టపోయాయి.
లాభాల్లో....
టీసీఎస్, ఇన్ఫీ, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనిలివర్ లాభపడ్డాయి.