బ్యాంకు షేర్ల దూకుడుతో పాటు.. అమెరికా ఎన్నికల భయాలను బేఖాతరు చేస్తూ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపటం వల్ల దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. ఇవాళ దేశీయ సూచీలు 9 నెలల గరిష్ఠాన్ని తకాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 553 పాయింట్లు లాభంతో 41,893 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 143 పాయింట్ల వృద్ధితో 12,263 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి..
బజాజ్ ఫిన్సర్వ్, రిలియన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్ లాభపడ్డాయి.
మారుతీ సుజూకీ, గేయిల్, భారతీ ఎయిర్టెల్, గ్రాసిమ్, ఏషియన్ పేయింట్స్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 28 పైసలు బలపడి రూ. 74.08 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి: త్వరలో భారత్కు 15 వేల టన్నుల ఉల్లి!