స్టాక్ మార్కెట్లు (Stock Market) సోమవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 29 పాయింట్లు పెరిగి కొత్త రికార్డు స్థాయి అయిన 60,078 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 2 పాయింట్ల లాభంతో 17,855 వద్దకు చేరింది.
ఆటోమొబైల్ షేర్లు సానుకూలంగా స్పందించగా.. ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా సూచీలు ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 60,412 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 59,887 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,943 పాయింట్ల గరిష్ఠ స్థాయి (కొత్త గరిష్ఠం), 17,802 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
మారుతీ సుజుకీ, ఎం&ఎం, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలను గడించాయి.
హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఎల్&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్) సూచీలు నష్టపోయాయి.
ఇదీ చదవండి: ధన్‌ధనాధన్ 'రిలయన్స్'- రూ.16లక్షల కోట్లకు ఎం-క్యాప్