ETV Bharat / business

ఒడుదొడుకుల మధ్య ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

Stock Market Today: స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 12 పాయింట్లు తగ్గింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ అతి స్వల్పంగా 10 పాయింట్లు నష్టపోయింది.

Stock Market
Stock Market
author img

By

Published : Dec 30, 2021, 3:41 PM IST

Stock Market Today: ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు తగ్గి.. 57,794 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ- నిఫ్టీ 10 పాయింట్ల అతిస్వల్ప నష్టంతో.. 17,204 వద్ద ఫ్లాట్​గా ముగిసింది.

గురువారం సెషన్​లో ఐటీ షేర్లు రాణించిగా.. ఆయిల్​ & గ్యాస్, పవర్​, రియాల్టీ, లోహ షేర్లు 1 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ షేర్లు ఫ్లాట్ ట్రేడయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా..

ఇంట్రాడేలో సెన్సెక్స్​ ముప్పై షేర్లలో 15 షేర్లు డీలా పడ్డాయి.

సెన్సెక్స్ ఉదయం 57,755 వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఆద్యంతం ఊగిసలాడిన సూచీ.. ఇంట్రాడేలో 58,010 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని.. 57,579 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది.

మరో సూచీ నిఫ్టీ ఇంట్రాడేలో 17,146 వద్ద కనిష్ఠస్థాయి.. 17,264 పాయింట్ల గరిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​టెక్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, టైటాన్​, విప్రో, డాక్టర్ ​రెడ్డీస్​, టీసీఎస్​, హిందూస్థాన్​యూనిలీవర్​, భారతీఎయిర్​టెల్​ ఎక్కువగా లాభపడ్డాయి.

రిలయన్స్​, టాటా స్టీల్​, మారుతి, బజాజ్​ఫిన్​సెర్వ్​, సన్​ఫార్మా, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎల్​ అండ్​ టీ, నెస్లే, ఎం అండ్​ ఎం షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

ఒడుదొడుకులకు కారణాలివే..

  • అంతర్జాతీయంగా మిశ్రమ పరిస్థితులు, దేశీయంగా ఒమిక్రాన్​, కొవిడ్​ కేసుల పెరుగుదల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు.
  • డిసెంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండగా.. మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి.
  • రియాల్టీ, ఆయిల్​ అండ్​ గ్యాస్​, లోహ రంగాల అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణమైంది.

ఇదీ చూడండి: ఈపీఎఫ్​ ఈ-నామినేష‌న్ గడువు పొడిగింపు.. కానీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.