దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 277 పాయింట్ల నష్టంతో 38,089 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 83 పాయింట్లు కోల్పోయి 11,234 పాయింట్లకు చేరుకుంది.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ తాత్కాలిక నిలుపుదలతో అంతర్జాతీయ మార్కె్ట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇది దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
లోహ రంగ షేర్లు 2 శాతం నష్టపోగా.. బ్యాంకింగ్, వాహన సెక్టార్లు ఒకశాతం నష్టాల్లో ఉన్నాయి.
లాభ నష్టాల్లో...
ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఐటీసీ, టాటాస్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు...
ఆసియాలో షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు కూడా మంగళవారం చివరి సెషన్లో భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు ధర 0.9 శాతం పడిపోయి బ్యారెల్‌కు 39.42 డాలర్ల వద్ద కొనసాగుతోంది.