వరుస లాభాలకు బ్రేక్
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల ఆరంభ లాభాలు ఆవిరై నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 49 పాయింట్లు నష్టపోయి.. 61,716 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి.. 18,418 వద్ద ముగిసింది.