ETV Bharat / business

Stock Market: రోజంతా ఒడుదొడుకులు.. చివర్లో స్వల్ప నష్టాలు - sensex

STOCK MARKET LIVE UPDATES,
STOCK MARKET LIVE UPDATES
author img

By

Published : Jan 28, 2022, 9:23 AM IST

Updated : Jan 28, 2022, 3:55 PM IST

15:54 January 28

Stocks Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ వారంతపు సెషన్​ను​ నష్టాలతో ముగించాయి. ఆరంభంలో భారీ లాభాలు నమోదు చేసిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో ఒడుదొడుకుల ఎదుర్కొన్నాయి. చివరకు సెన్సెక్స్ 77 పాయింట్లు తగ్గి.. 57,200 వద్ద బలపడింది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,104 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ ఉదయం 57,795 పాయింట్లు వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. మిడ్​ సెషన్​ వరకు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. ఆఖరులో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 58,084 వద్ద గరిష్ఠానికి చేరింది. రోజులో 965 పాయింట్లు మధ్య కదలాడిన సూచీ.. మరో దశలో 57,119 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

మరో సూచీ ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 17,208 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,373 పాయింట్ల గరిష్ఠానికి చేరి.. 17,077 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

లాభానష్టాల్లోనివి ఇవే..

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్​బ్యాంకు, ఎం అండ్​ ఎం, విప్రో, ఐటీసీ, భారతీఎయిర్​టెల్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.

మారుతి, టెక్​మహీంద్రా, పవర్​గ్రిడ్​, ఐసీఐసీఐబ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, ఎస్​బీఐఎన్​, బజాజ్​ఫిన్​సర్వ్ షేర్లు​ ఎక్కువగా నష్టపోయాయి.

14:17 January 28

ఆరంభ లాభాలు ఆవిరి..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి.

ప్రస్తుతం సూచీలు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. ఇంట్రాడేలో 800 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ ప్రస్తుతం 100 పాయింట్లు పెరిగి.. 57 వేల 378 వద్ద ఉంది.

నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 17 వేల 164 వద్ద ట్రేడవుతోంది.

వారాంతంలో అమ్మకాలకు దిగుతుండటమే ఒడుదొడుకులకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాంకింగ్​, ఆటో రంగం షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి.

లాభనష్టాల్లో..

ఎన్టీపీసీ, యూపీఎల్​, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా రాణిస్తున్నాయి.

మారుతీ సుజుకీ, టెక్​ మహీంద్రా, పవర్​ గ్రిడ్​, ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ నష్టపోయాయి. ​

09:52 January 28

సెన్సెక్స్​ 700 ప్లస్​..

వారాంతంలో స్టాక్​ మార్కెట్లు రాణిస్తున్నాయి. విద్యుత్తు, లోహ, రియాల్టీ షేర్ల ఊతంతో.. దేశీయ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా పెరిగి.. 58 వేల మార్కును అధిగమించింది.

నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో.. 17 వేల 357కు చేరింది.

లాభనష్టాల్లో..

ఎం అండ్​ ఎం, ఓఎన్​జీసీ, ఐచర్​ మోటార్స్​, ఎన్​టీపీసీ అత్యధికంగా లాభాల్లో ఉన్నాయి.

మారుతీ సుజుకీ, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో ఈ రెండు షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.

09:05 January 28

Stock Market: వారాంతంలో కొనుగోళ్ల జోరు- మార్కెట్ల హోరు

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వారాంతంలో లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 500 పాయింట్లకుపైగా లాభంతో.. 57 వేల 777 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 140 పాయింట్లకుపైగా పెరిగి.. 17 వేల 250 ఎగువన కొనసాగుతోంది.

లోహ, విద్యుత్తు, రియాల్టీ రంగం షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

లాభనష్టాల్లో ఇవే..

భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, టాటా స్టీల్​, బజాజ్​ ఫినాన్స్​, టాటా కన్జూమర్​ ప్రొడక్ట్స్​ రాణిస్తున్నాయి.

సిప్లా, బజాజ్​ ఆటో స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Jan 28, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.