గత సెషన్లో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన స్టాక్ మార్కెట్లు బుధవారం(stock market news today) సెషన్లోనూ అదేజోరు కొనసాగిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్(bse sensex today) 371కి పాయింట్లకు పైగా లాభంతో 60,656వేల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145కు పైగా పాయింట్లు వృద్ధి చెంది(nifty today) 18,137 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగుతున్నందువల్లే సుచీలు లాభాల్లో పయనిస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు.
బీఎస్ఈలోని 30 షేర్ల ఇండెక్స్‌లో మారుతీ, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియాలోని ఇతర మార్కెట్లు షాంఘై, నిక్కీ(జపాన్) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇవీ చదవండి: