ETV Bharat / business

Stock Market Live: రంకెలేసిన బుల్​- 18,000పైకి నిఫ్టీ - స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్

Stocks live
స్టాక్​మార్కెట్స్​ లైవ్​
author img

By

Published : Nov 12, 2021, 9:35 AM IST

Updated : Nov 12, 2021, 3:38 PM IST

15:37 November 12

వరుస నష్టాలకు చెక్​ పెడుతూ దేశీయ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 767పాయింట్లు లాభపడి 60,687 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 229పాయింట్లు వృద్ధి చెంది 18,103కు చేరింది.

ఐటీ, రియాల్టీ, విద్యుత్​ రంగ షేర్లు దూసుకెళ్లడం వల్ల నిఫ్టీ.. 18వేల మార్కును తిరిగి అందుకోగలిగింది.

ఇంట్రాడే సాగిందిలా...

అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​, నిఫ్టీ.. కొద్దిసేపు నష్టాల్లో ట్రేడ్​ అయ్యాయి. ఆ వెంటనే బలంగా పుంజుకున్నాయి.

60,248 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​.. 59,997 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత బలపడి, మొత్తం మీద 767పాయింట్ల లాభంతో 60,687 వద్ద ముగిసింది.

17,977 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. 17,905 కనిష్ఠానికి చేరి అక్కడి నుంచి బలపడింది. చివరికి 229 పాయింట్లు వృద్ధి చెంది 18,103 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలు...

  • టెక్​ఎమ్​, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్​, రిలయన్స్​ షేర్లు లాభాలు గడించాయి.
  • బజాజ్​ ఆటో, టాటాస్టీల్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు నష్టాలు చవిచూశాయి.

సోమవారం లాభాలు గడించిన దేశీయ సూచీలు.. వరుసగా మూడు రోజులు నష్టపోయాయి. శుక్రవారం లాభాలతో వారాన్ని ముగించాయి.

14:21 November 12

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, లోహ రంగాల షేర్ల దన్నుతో సూచీలు దూసుకుపోతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 60,630 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 18,083 వద్ద కొనసాగుతోంది.

12:51 November 12

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు స్థిరంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో 60,326 వద్ద కదలాడుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 17,998 వద్ద ట్రేడవుతుంది.

ఆటో రంగం మినహా.. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు మిగిలిన అన్ని రంగాల షేర్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.  

  • టెక్​మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్​, రిలయన్స్​, బజాజ్​ ఫిన్​సెర్వ్ ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • బజాజ్​ ఆటో, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, యాక్సిస్ ​బ్యాంకు, ఎస్​బీఐఎన్​, అల్ట్రాటెక్ ​సిమెంట్ ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

08:21 November 12

వారాంతంలో లాభాల్లో మార్కెట్లు

వారాంతపు సెషన్​ను స్టాక్ మార్కెట్లు (Stock Market Live) లాభాలతో ప్రారంభించాయి. గడిచిన మూడు రోజుల్లో మదుపర్లకు నష్టాలను మిగిల్చిన సూచీలు.. శుక్రవారం సెషన్​లో సానుకూలంగా ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభంతో 60,306 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా వృద్ధి చెంది 17,993 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్​ 30 సూచీలో పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, బజాబ్​ ఆటో, అల్ట్రాటెక్​సిమెంట్​ మినహా మిగినవి లాభాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Nov 12, 2021, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.