Stock Market Close: సోమవారం నష్టాల అనంతరం.. స్టాక్ మార్కెట్లు మళ్లీ ఇవాళ్టి సెషన్లో లాభాలు నమోదుచేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 697 పాయింట్ల పెరిగి 57 వేల 989 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 17 వేల 316 వద్ద సెషన్‌ను ముగించింది.
రిలయన్స్, ఐటీ షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల్లో పయనించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
తొలుత దేశీయ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ముడిచమురు ధరల పెరుగుదల, ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలతో సెన్సెక్స్ ఓ దశలో 360కిపైగా పాయింట్లు కోల్పోయి.. 56 వేల 930 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం ఒంటి గంట అనంతరం.. మళ్లీ సూచీలు దూసుకెళ్లాయి.
లాభనష్టాల్లో ఇవే..
ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక శాతం మేర లాభపడింది. రియాల్టీ ఒక శాతం పడిపోయింది. బీఎస్ఈ 30 ప్యాక్‌లో దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి.
టెక్ మహీంద్రా, బీపీసీఎల్, టాటా మోటార్స్, రిలయన్స్, ఐఓసీ రాణించాయి.
హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, బ్రిటానియా, సిప్లా, ఐచర్ మోటార్స్ డీలాపడ్డాయి.
ఇవీ చూడండి: 10 నిమిషాల్లోనే జొమాటో డెలివరీ! రిస్క్ కాదా? క్వాలిటీ సంగతేంటి?