ETV Bharat / business

అవే భయాలు... మళ్లీ భారీగా నష్టపోయిన మార్కెట్లు - Nifty update

కరోనా ప్రభావంతో దేశీయ మార్కెట్లు నేడూ నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో లాభాల్లోకి వచ్చినప్పటికీ.. సెషన్​ ముగింపునకు ముందు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్​ 581 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 205 పాయింట్లు క్షీణించింది.

Sensex
భారీ నష్టాల్లోకి మార్కెట్లు
author img

By

Published : Mar 19, 2020, 4:11 PM IST

కరోనా భయాలతో స్టాక్​ మార్కెట్లు మరోమారు భారీ నష్టాలను చవిచూశాయి. దేశంలో కొవిడ్​-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. ఓ దశలో హెవీ వెయిట్​ షేర్ల దన్నుతో స్వల్ప లాభాల్లోకి వచ్చిన సూచీలు సెషన్​ ముగింపునకు ముందు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​ 581 పాయింట్ల మేర నష్టపోయి 28, 288 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 205 పాయింట్లు క్షీణించింది. ఇంట్రాడేలో 7,900 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ.. కాస్త కొలుకుని 8,263 పాయింట్ల వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..

ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​, కొటక్​ బ్యాంక్​, హీరో మోటోకార్ఫ్​, పవర్​ గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, బజాజ్​ ఆటో లాభాల్లోకి వెళ్లాయి.

బజాజ్​ ఫినాన్ష్ షేర్లు సుమారు 10 శాతం మేర నష్టపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో యాక్సిస్​ బ్యాంక్​, మారుతి, ఎంఅండ్​ఎం, టెక్​ మహీంద్ర, ఓఎన్​జీసీ వంటి సంస్థలు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లు రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 81 పైసలు క్షీణించి రూ.75.07కు చేరుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.