ETV Bharat / business

భారీ నష్టాల్లో మార్కెట్లు- ఆ బ్యాంక్​ నిర్ణయమే కారణం!

అమెరికా ఫెడరల్​ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం దేశీయ స్టాక్​ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 1550 పాయింట్లకుపైగా నష్టంతో ట్రేడవుతోంది.

stocks
భారీ నష్టాల్లో మార్కెట్లు- ఆ బ్యాంక్​ నిర్ణయమే కారణం!
author img

By

Published : Mar 16, 2020, 10:49 AM IST

అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వ్' కీలక వడ్డీ రేట్లు తగ్గించడం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండనుందన్న భయాలను మరింత పెంచింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ ఒకానొక దశలో 2182 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం 1550 పాయింట్లకు పైగా నష్టపోయి 32, 547 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 430 పాయింట్లకు పైగా పతనమై 9515 వద్ద ట్రేడవుతోంది.

మదుపరుల సంపద ఆవిరి

తాజా మార్కెట్ నష్టాలతో రూ. 6.25 లక్షల కోట్ల విలువైన మదుపరుల సంపద ఆవిరైంది. ప్రారంభ సెషన్​లో బీఎస్​ఈలోని కంపెనీల షేర్ల విలువ రూ. 6,25, 501 కోట్ల మేర తగ్గి రూ. 1, 23, 00,741కు చేరుకుంది.

నష్టాల్లో ఉన్న షేర్లు

ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సహా సెన్సెక్స్ సూచీలోని 30 వ్యాపార సంస్థల షేర్లూ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు..

జపాన్ సూచీ నిక్కీ మినహా ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. షాంఘై సూచీ హాంగ్ సెంగ్, కోస్పీలు 2 శాతం మేర నష్టపోయాయి.

అదే దారిలో ముడి చమురు..

ఫెడ్ రేట్ల కోత కారణంగా ముడిచమురు ధర మరో 2 శాతానికి పైగా క్షీణించింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 32.84 డాలర్లుగా కొనసాగుతోంది.

రూపాయి క్షీణత

డాలరు మారకం ధరతో పోలిస్తే రూపాయి విలువ 42 పైసలు క్షీణించి 74.17 గా ఉంది.

ఇదీ చూడండి: కరోనాను చంపే 'స్మార్ట్​ఫోన్​ సోప్'​ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.