స్టాక్ మార్కెట్లు (Stock Market) శుక్రవారం లాభాలు గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 381 పాయింట్లు పెరిగి 60,059 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 105 పాయింట్ల లాభంతో 17,895 వద్దకు చేరింది.
ఆరంభం నుంచే సానుకూలంగా స్పందించిన సూచీలు.. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడిన తర్వాత భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 60,212 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,830 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,941 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,840 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు లాభాలను గడించాయి. హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీ నష్టపోయింది.
ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎస్బీఐ ఆన్లైన్ సేవలకు అంతరాయం