ETV Bharat / business

చివరి గంటలో కొనుగోళ్లు- 48,800పైకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లోనూ లాభాలను గడించాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 48,800 మార్క్ దాటింది. నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 14,550పైన స్థిరపడింది.

Stocks close in Profits
స్టాక్ మార్కెట్లకు లాభాలు
author img

By

Published : Apr 15, 2021, 3:41 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 260 పాయింట్ల లాభంతో 48,804 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 77 పాయింట్లు బలపడి 14,581 వద్ద ముగిసింది.

చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక షేర్లు పుంజుకోవడం కూడా కలిసొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 48,857 పాయింట్ల అత్యధిక స్థాయి: 48,010 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,597 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,353 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, డాక్టర్​ రెడ్డీస్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

మారుతీ, ఇన్ఫోసిస్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్​ సిమెంట్, నెస్లే షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో టోక్యో, సియోల్ సూచీలు లాభాలను గడించాయి. షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి.

ఇదీ చదవండి: మార్చిలో 8 ఏళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.