స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు బలపడి.. 52,232 వద్దకు చేరింది. నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 15,690 వద్ద స్థిరపడింది. ఆర్థిక, లోహ రంగాలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
- టైటాన్, ఓఎన్జీసీ, ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, వవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్‌టెక్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.