స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్, ఫార్మా, లోహ రంగ షేర్ల దూకుడు కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూలతలు తోడవడం వల్ల దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 321 పాయింట్లు వృద్ధి చెంది 49,527 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 14,929 వద్ద ట్రేడ్ అవుతోంది.
హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్, ఎస్బీఐ, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డి షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, రిలయన్స్, ఇన్ఫీ, టెక్ఎమ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.