ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు ఆర్​బీఐ బూస్ట్​- సెన్సెక్స్ 1,016 ప్లస్

Stock Market Today India: ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలతో స్టాక్​ మార్కెట్లలో బుల్​ జోరు కొనసాగింది. సెన్సెక్స్​ 1016 పాయింట్లకుపైగా లాభంతో 58,649 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 239 కుపైగా పాయింట్లు లాభపడింది.

Stock Market Today India
స్టాక్ మార్కెట్లకు ఆర్​బీఐ బూస్ట్
author img

By

Published : Dec 8, 2021, 3:40 PM IST

Stock Market Today India: ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మార్కెట్లను పరుగులు పెట్టించాయి. దీంతో స్టాక్​మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగా ఆర్థిక షేర్లు లాభపడ్డాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1016 పాయింట్లు లాభంతో 58,649 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఇంట్రాడేలో.. 58,158 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ లాభాల్లో కొనసాగింది. తొలుత 58,122 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్​.. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పుంజుకుని 58,702 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 239 పాయింట్ల వృద్ధితో 17,470 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో.. 17,315 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒకనొక దశలో 17,309 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. తిరిగి పుంజుకొని 17,485 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది.

లాభనష్టాల్లోనివి...

ముప్పై షేర్ల ఇండెక్స్​లో... కోటక్​ మహీంద్ర బ్యాంక్​, పవర్​ గ్రిడ్​ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి.

ఇవీ చూడండి:

కీలక వడ్డీ రేట్లు యథాతథం.. రిజర్వు బ్యాంకు ప్రకటన

'2021-22లో భారత వృద్ధి రేటు 8.4 శాతం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.