ఒడుదొడుకుల సెషన్లో స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు కోల్పోయి 52,586 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 15,763 వద్దకు చేరింది.
బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
- సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా రికార్డు స్థాయిలో లాభాలను గడించాయి. పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.